Prabhas: ‘బాహుబలి’ నిర్మాతలను కలిసిన ప్రభాస్‌.. పార్ట్‌3 కోసమేనా..!

ప్రభాస్‌ (Prabhas)కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన సినిమా ‘బాహుబలి’. తాజాగా ఆ చిత్ర నిర్మాతలను ప్రభాస్‌ కలిశారు. ఓ సినిమా కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Published : 23 Apr 2023 10:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బాహుబలి’(Baahubali).. ఈ సిరీస్‌ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో టాలీవుడ్‌ పేరు వినిపించేలా చేశాయి. ప్రభాస్ (Prabhas) కెరీర్‌ను కూడా ఈ చిత్రం మలుపు తిప్పింది. రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది. కొన్ని రోజుల నుంచి ‘బాహుబలి-3’ రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ప్రభాస్‌ ‘బాహుబలి’ నిర్మాతలను కలవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ప్రభాస్‌ వాళ్లని కలిసింది పార్ట్‌3 కోసమేనా అని బాక్సాఫీస్‌ వద్ద చర్చ మొదలైంది. ‘బాహుబలి’ నిర్మాతలు ప్రభాస్‌ కోసం ఓ కథను ఫైనలైజ్‌ చేశారని.. అందులో ఈ యంగ్‌ రెబల్‌ స్టార్‌ ఇప్పటి వరకూ చేయని క్యారక్టర్‌ను చేయనున్నాడనే టాక్‌ కూడా వినిపిస్తోంది. ‘బాహుబలి’ రెండు పార్ట్‌ల కంటే ఈ కథ చాలా భిన్నంగా ఉంటుందని అంటున్నారు.  గతంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలకు ముందు ప్రభాస్‌ ఓ సందర్భంగా ‘బాహుబలి’ మూడో భాగం గురించి మాట్లాడుతూ..‘‘పార్ట్‌-3 (Baahubali 3) గురించి నాక్కూడా తెలియదు. సమయం వచ్చినప్పుడు ఏదైనా జరగొచ్చు’’ అని చెప్పారు. ఇప్పుడు నిర్మాతలను కలవడంతో ఆ మాటలు మరోసారి తెరపైకి వచ్చాయి. అయితే ప్రభాస్‌ వీరిని ఎందుకు కలిశారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

బాహుబలి నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్‌ దేవినేని (Prasad Devineni) ఇటీవల ఓ మీడియాతో ఈ సీక్వెల్‌ గురించి మాట్లాడారు. ‘‘మూడో భాగం వచ్చే అవకాశం ఉంది. అయితే అది ఎప్పుడు వస్తుందో చెప్పలేం. ప్రస్తుతం రాజమౌళి బిజీగా ఉన్నారు. తన చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ అయ్యాక దీని గురించి ఆలోచిస్తాం.  అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏదో సమయంలో పార్ట్‌3 తెరకెక్కుతుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ప్రయత్నాలు ఇంకా మొదలుపెట్టలేదు’’ అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని