Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో రాఘవేంద్రరావు తనయుడితో మూవీ చేయాలనుకున్నారు!

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తనయకుడు ప్రకాశ్‌తో రాజమౌళి ఓ సినిమా తెరకెక్కించాలనుకున్నారు. కానీ, అది సాధ్యపడలేదు.  

Updated : 18 Jul 2023 09:56 IST

హైదరాబాద్‌: ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli).. ఇప్పుడది కేవలం పేరు కాదు, అదొక బ్రాండ్‌. ఆయన దర్శకత్వంలో నటించాలని ప్రతి నటుడూ కోరుకుంటారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (K Raghavendra Rao) దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకుని, తెలుగు సినీ కీర్తిని ప్రాంతీయ, జాతీయ స్థాయిని దాటించి అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు. అలాంటి రాజమౌళి తన గురువైన రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్‌ కోవెలమూడి (Prakash Kovelamudi)ని డైరెక్ట్‌ చేసే అవకాశం మిస్సయింది.

ఎన్టీఆర్‌ (NTR) కథానాయకుడిగా ‘స్టూడెంట్‌ నెం.1’ (Student No: 1) తో రాజమౌళి దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో రాజమౌళి దర్శకత్వంలో ప్రకాశ్‌ హీరోగా ఓ సినిమా ప్లాన్‌ చేశారు. అందుకు సంబంధించి కథా చర్చలు కూడా జరిగాయి. ఆ చిత్రానికి ‘విజయ సింహ’ అనే పేరును కూడా అనుకున్నారు. అదితి అగర్వాల్‌ను కథానాయికగా ఎంపిక చేశారు. దాదాపు నాలుగు నెలల పాటు ఆ స్క్రిప్ట్‌పై పనిచేశారు. ఏమైందో ఏమో తెలియదు. ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత జాన్‌ మహేంద్రన్‌ దర్శకత్వంలో ‘నీతో’ చిత్రం ద్వారా ప్రకాశ్‌ హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. మరోవైపు రాజమౌళి ‘సింహాద్రి’ (Simhadri) తీసి హిట్‌ కొట్టారు.

ఎన్టీఆర్‌తో ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’లాంటి మూవీ.. అలా‘శక్తి’గా మారిపోయింది!

ఆ తర్వాత ఇటు రాజమౌళి, అటు ప్రకాశ్‌ వేర్వేరు దారుల్లో ప్రయాణించారు. నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన ప్రకాశ్‌ దర్శకుడిగా మారారు. ‘బొమ్మలాట’ (Bommalata), ‘అనగనగా ఓ ధీరుడు’ (Once Upon a Warrior), ‘సైజ్‌ జీరో’ (Size Zero) తదితర చిత్రాలను తీశారు. 2019లో కంగనా రనౌత్‌ (Kangana Ranaut) కథానాయికగా ‘జడ్జిమెంటల్‌ హై క్యా’ (Judgementall Hai Kya) తెరకెక్కించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని