Prakash Raj: ఆ స్టార్‌ హీరోలపై ప్రశంసలు కురిపించిన ప్రకాశ్‌ రాజ్‌..

తనదైన శైలిలో డైలాగ్‌లు చెబుతూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు ప్రకాశ్‌ రాజ్‌(Prakash Raj). తాజాగా ఆయన బాలీవుడ్(Bollywood) స్టార్‌ హీరోల గురించి మాట్లాడారు.

Updated : 15 Dec 2022 13:41 IST

హైదరాబాద్‌: తన నటనతో అన్ని భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రకాశ్‌ రాజ్(Prakash Raj). ప్రతినాయకుడి పాత్రల్లో అలరిస్తూ ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు. తాజాగా ఆయన బాలీవుడ్‌ స్టార్‌ హీరోలపై ప్రశంసలు కురిపించాడు. హిందీలో అగ్ర కథానాయకులైన సల్మాన్‌ ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌లను పొగడ్తలతో ముంచెత్తాడు.

సల్మాన్‌తో కలిసి సినిమాల్లో నటించిన అనుభవాన్ని ఇటీవల ప్రకాశ్‌ రాజ్‌ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ‘సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) చాలా మంచి వ్యక్తి. తనతో కలిసి పనిచేయడం నాకు ఇష్టం. అతడు ఎప్పుడూ భయపడడు. నేను సల్మాన్‌తో కలిసి రెండు సినిమాల్లో నటించాను. ఆయన చిత్ర పరిశ్రమలో చాలా మందికి సాయం చేశాడు. చాలామంది అభిమానులను సొంతం చేసుకున్నాడు’’ అని చెప్పాడు. ఇక బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌(Amitabh Bachchan) గురించి మాట్లాడుతూ..‘అమిత్ జీ ఒక నిఘంటువు. ఆయన మహావృక్షంతో సమానం. దాని కింద ఎందరో నటులు ఎదుగుతున్నారు. ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు. ఆయన సినీ పరిశ్రమకు మూలస్తంభం లాంటి వ్యక్తి’’ అంటూ అమితాబ్‌ బచ్చన్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని