Prathinidhi 2: నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!

‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్‌?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే.

Updated : 20 Apr 2024 12:13 IST

‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్‌?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. నారా రోహిత్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించారు. కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, సురేంద్రనాథ్‌ బొల్లినేని నిర్మాతలు.  సిరీ లెల్ల, దినేశ్‌ తేజ్‌, సప్తగిరి, జిషు సేన్‌ గుప్తా కీలక పాత్రలు పోషించారు. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ శుక్రవారం విడుదల చేశారు. ‘మన స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీజీ చనిపోయినప్పుడు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు? ఎంతమంది గుండెపోటుతో చచ్చారు?’  అంటూ మొదలయ్యే ట్రైలర్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘ఒక్కసారి ఎక్కి కూర్చున్నాడంటే ఐదేళ్లు చెప్పింది చేయాల్సిందే, డిసైడ్‌ చేసుకో, నిన్ను ఎవరు పరిపాలించాలో...’ అంటూ కథానాయకుడు చెప్పే మాటలు ట్రైలర్‌కి ఆకర్షణగా నిలిచాయి. రాజకీయ వ్యవస్థలోని అవినీతిని ప్రశ్నిస్తూ సాగే కథతో రూపొందిన సినిమా ఇది. మహతి స్వరసాగర్‌ సంగీతం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని