Prem Rakshith: ఆ క్షణం కన్నీళ్లొచ్చాయి.. ఆయన ప్రేమతో దగ్గరకు తీసుకున్నారు: ప్రేమ్‌రక్షిత్‌

ఆస్కార్‌ (Oscars 2023) వేడుకలపై  కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ (Prem Rakshith) స్పందించారు. మన పాటకు అవార్డు రావడం ఆనందంగా ఉన్నట్లు చెప్పారు.

Published : 15 Mar 2023 10:40 IST

హైదరాబాద్‌: ‘ఆస్కార్‌’ (Oscars 2023) వేదికగా తాను కొరియోగ్రఫీ చేసిన ‘నాటు నాటు’ (Naatu Naatu)కు దక్కిన గౌరవం పట్ల ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ (Prem Rakshith) ఆనందం వ్యక్తం చేశారు. ఆస్కార్‌ వేడుకలకు వెళ్తానని తాను అస్సలు ఊహించలేదని చెప్పారు. అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

‘‘ఆస్కార్‌ (Oscars 2023)కు వెళ్తానని నేను అస్సలు అనుకోలేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ సపోర్ట్‌తోనే నేను లాస్‌ ఏంజెల్స్‌ వెళ్లగలిగాను. రాజమౌళి (Rajamouli) వల్లే ఈ పాటకు ఇంతటి ఆదరణ లభించింది. లాస్‌ ఏంజిల్స్‌ వెళ్లిన వెంటనే ‘నాటు నాటు’ రిహార్సల్స్‌లో పాల్గొన్నాను. ఆస్కార్‌ వేడుకల్లో స్టేజ్‌పై ఆ పాట ప్రదర్శన పూర్తైన వెంటనే అక్కడున్న వాళ్లందరూ లేచి నిల్చొని చప్పట్లు కొట్టారు. ఆ క్షణం కన్నీళ్లు వచ్చేశాయి. అవార్డు తీసుకున్న తర్వాత కీరవాణి నన్ను ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. ఆ క్షణం నేను పొందిన సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను’’ అని ప్రేమ్‌ రక్షిత్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని