Dil Raju: నిర్మాత దిల్‌ రాజు ఇంట విషాదం

సినీ నిర్మాత దిల్‌ రాజు ఇంట విషాదం చోటు చేసుకుంది. 

Published : 10 Oct 2023 01:48 IST

హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) ఇంట విషాదం నెలకొంది. ఆయనకు పితృవియోగం కలిగింది. దిల్‌ రాజు తండ్రి శ్యామ్‌ సుందర్‌రెడ్డి (86) సోమవారం సాయంత్రం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ శ్యామ్‌ సుందర్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు. శ్యామ్‌ సుందర్‌ రెడ్డి స్వస్థలం నిజామాబాద్‌ జిల్లాలోని నర్సింగ్‌పల్లి. ఆయనకు దిల్‌ రాజుతోపాటు మరో ఇద్దరు కుమారులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని