RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఎంతటి ఘన విజయం అందుకుందో విధితమే. రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ వేదికగా ప్రేక్షకుల్ని అలరిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: రామ్‌చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR) కథానాయకులుగా దర్శకుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం ఎంతటి ఘన విజయం అందుకుందో విదితమే. రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ వేదికగా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. అలా ఈ చిత్రాన్ని వీక్షించిన కొందరు విదేశీయులు సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు పెట్టారు. తాజాగా వారి జాబితాలోకి కొందరు భారతీయ సినీ అభిమానులు, ప్రముఖులూ చేరారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ సౌండ్ ఇంజినీర్ పెట్టిన కామెంట్‌పై ‘బాహుబలి’ చిత్రాల నిర్మాత శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda) మండిపడ్డారు. ఏం జరిగిందంటే?.. ‘‘నిన్న రాత్రి RRR అనే చెత్తను ఓ 30 నిమిషాలు చూశా’’ అని ఓ ఫిల్మ్‌మేకర్ ఇటీవల ట్వీట్ చేశారు. దానికి సమాధానంగా ‘‘గే లవ్ స్టోరీ’’ అంటూ ఆస్కార్ అవార్డు విన్నింగ్ సౌండ్ ఇంజినీర్ రసూల్ పూకుట్టి (Resul Pookutty) రాసుకొచ్చారు. దీన్ని రీట్వీట్ చేసి, ‘‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ అని నేను అనుకోవడం లేదు. అది గే లవ్ స్టోరీ అని మీరెలా సమర్థిస్తారు? మీరన్నట్టు ఒకవేళ అది గే లవ్ స్టోరీ అయితే అందులో తప్పేంటి?నిపుణులైన మీలాంటి వారి వ్యాఖ్యాలు చాలా నిరాశకు గురి చేయడమే కాదు, మీ స్థాయికి తగినట్లూ లేవు’’ అని శోభు కాస్త తీవ్రంగానే సమాధానమిచ్చారు.
‘‘మీతో ఏకీభవిస్తున్నా. ఒకవేళ అది గే లవ్ స్టోరీ అయినా అందులో ఎలాంటి తప్పు ఉండదు. నేను నా స్నేహితుడి ట్వీట్‌కు మాత్రమే అలా సమాధానమిచ్చా. అయినా ఈ విషయం సోషల్ మీడియాలో వ్యాప్తి చెందింది. ఇందులో వక్రీకరించాల్సింది ఏం లేదు. శోభూ మీరు దీన్ని సీరియస్‌గా తీసుకోవద్దు. నేనవరినీ ఉద్దేశించి అలా అనలేదు’’ అని శోభుకు రసూల్ రిప్లై ఇచ్చారు.
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రానికిగానూ అత్యుత్తమ సౌండ్ మిక్సింగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న రసూల్ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. తెలుగులో రూపొందిన పాన్ ఇండియా చిత్రాలు ‘రాధేశ్యామ్’, ‘పుష్ప: ది రైజ్’కు ఆయన పనిచేశారు. రసూల్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి దాన్ని వెంటనే తొలగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్‌లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్‌ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్‌ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్‌బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్‌ను చూడలేదు: మాధవన్
అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్‌ను చూడలేదన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్