‘పీఎస్‌పీకే 27’.. ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ ఆరోజే

ఎప్పుడెప్పుడా అని సినీ అభిమానులు ఎదురుచూస్తున్న ‘పీఎస్‌పీకే 27’ చిత్రంలోని పవన్‌ కల్యాణ్‌ ఫస్ట్‌లుక్‌, చిత్ర టైటిల్‌ త్వరలోనే రాబోతున్నాయి. శివరాత్రి కానుకగా మార్చి 11న ఈ సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడుగా క్రిష్‌ తెరకెక్కిస్తున్న చిత్రమే ‘పీఎస్‌పీకే 27’ (వర్కింగ్‌ టైటిల్‌). పీరియాడికల్‌ డ్రామా నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. పవన్‌ ఇప్పటి వరకు పోషించని వైవిధ్య పాత్ర పోషిస్తున్నారు.

Published : 24 Feb 2021 23:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పుడెప్పుడా అని సినీ అభిమానులు ఎదురుచూస్తున్న ‘పీఎస్‌పీకే 27’ చిత్రంలోని పవన్‌ కల్యాణ్‌ ఫస్ట్‌లుక్‌, చిత్ర టైటిల్‌ త్వరలోనే రాబోతున్నాయి. శివరాత్రి కానుకగా మార్చి 11న ఈ సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడుగా క్రిష్‌ తెరకెక్కిస్తున్న చిత్రమే ‘పీఎస్‌పీకే 27’ (వర్కింగ్‌ టైటిల్‌). పీరియాడికల్‌ డ్రామా నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. పవన్‌ ఇప్పటి వరకు పోషించని వైవిధ్య పాత్ర పోషిస్తున్నారు. నిధి అగర్వాల్‌ నాయిక. బాలీవుడ్‌ నటులు అర్జున్‌ రాంపాల్‌, జాక్వెలిన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ప్రస్తుతం చార్మినార్‌ నేపథ్యంలో సాగే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం భారీ సెట్‌నే రూపొందించారు. ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ‘గజదొంగ’,‘అంతర్వాహిని’, ‘బందిపోటు’,‘హరిహర వీరమల్లు’ పేర్లు వార్తల్లో నిలిచాయి. మరి వీటిలో ఏదైనా టైటిల్‌ తీసుకున్నారా, కొత్త పేరు తెరపైకి వస్తుందా? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే విడుదలైన పవన్‌ కల్యాణ్‌ ప్రీలుక్‌ సినిమాపై అంచనాలు పెంచుతోంది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు