Puri Jagannadh: ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కాంబో రిపీట్‌.. అదిరే అప్‌డేట్‌

Puri Jagannadh: పూరి జగన్నాథ్‌-రామ్‌ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆదివారం వెల్లడించనున్నారు.

Published : 13 May 2023 17:18 IST

హైదరాబాద్‌: ఒకప్పుడు వరుస పరాజయాలతో సతమతమైన స్టార్‌ దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) కెరీర్‌కు ఊపు తీసుకొచ్చిన చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ (iSmart Shankar). రామ్‌ (Ram) కథానాయకుడిగా పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. రామ్‌ నటన, పూరి టేకింగ్‌ మాస్‌ను మెప్పించాయి. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో కొత్త సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పూరి జగన్నాథ్‌ చిత్ర నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్‌ స్పెషల్‌ అప్‌డేట్‌ను పంచుకుంది. ‘నాలుగేళ్ల తర్వాత ఉస్తాద్‌ రామ్‌ పోతినేని, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కలిసి పనిచేయబోతున్నారు. దిమాక్‌ ఖరాబ్‌ అనౌన్స్‌మెంట్‌’ అంటూ కొత్త చిత్రానికి సంబంధించిన వివరాలను ఆదివారం సాయంత్రం 4గంటలకు తెలియజేయనున్నట్లు వెల్లడించింది. 2019లో విడుదలైన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ బాక్సాఫీస్‌ వద్ద రూ.75కోట్లకు పైగా వసూలు చేసింది. పూరి కనెక్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్‌, ఛార్మి ఈ సినిమాను నిర్మించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని