Rajinikanth: హిందీ నిర్మాతతో రజనీకాంత్‌ కొత్త చిత్రం

బాలీవుడ్‌ సీనియర్‌ నిర్మాత సాజిద్‌ నడియాడ్‌వాలా.. తమిళ అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌తో చేతులు కలిపారు. వీరిద్దరూ కలసి ఓ కొత్త చిత్రం చేయనున్నారనే ఆసక్తికర విషయాన్ని మంగళవారం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తూ.. ఇద్దరూ కలిసి ఉన్న ఓ ఫొటో పంచుకున్నారు.

Updated : 28 Feb 2024 09:46 IST

బాలీవుడ్‌ సీనియర్‌ నిర్మాత సాజిద్‌ నడియాడ్‌వాలా.. తమిళ అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌తో చేతులు కలిపారు. వీరిద్దరూ కలసి ఓ కొత్త చిత్రం చేయనున్నారనే ఆసక్తికర విషయాన్ని మంగళవారం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తూ.. ఇద్దరూ కలిసి ఉన్న ఓ ఫొటో పంచుకున్నారు. అయితే ఇది తమిళంలో రూపొందుతుందా? హిందీలో చేస్తారా? అనేది స్పష్టం చేయకపోవడంతో సినీవర్గాలు, ప్రేక్షకుల్లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ‘దిగ్గజ నటుడు రజనీకాంత్‌తో కలిసి పని చేయడం నాకొక గౌరవం. మర్చిపోలేని మా ప్రయాణం మొదలు కానున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని అంటడం ఖాయం’ అంటూ సాజిద్‌ ఎక్స్‌ ద్వారా వ్యాఖ్యానించారు. దీనిపై ప్రముఖ సినీ విమర్శకుడు తరణ్‌ ఆదర్శ్‌ సైతం స్పందించారు. ‘రజనీకాంత్‌-సాజిద్‌ నడియాడ్‌వాలా కలిసి మొదటిసారి ఓ చిత్రం చేయనున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తారు’ అని పేర్కొన్నారు. రజనీకాంత్‌ చివరిసారి ‘లాల్‌ సలామ్‌’లో కనిపించిన విషయం విదితమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని