Ram Charan: దిల్లీలో రామ్‌చరణ్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌.. వీడియోలు వైరల్‌

లాస్‌ ఏంజిల్స్‌ నుంచి స్వదేశానికి చేరుకున్నారు నటుడు రామ్‌చరణ్‌ (Ram Charan). అభిమానులు ఆయనకు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు. 

Updated : 17 Mar 2023 17:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) దిల్లీకి చేరుకున్నారు. ‘ఆస్కార్‌’ (Oscars 2023) వేడుకల్లో భాగంగా గత కొన్నిరోజుల నుంచి లాస్‌ ఏంజిల్స్‌లో ఉన్న ఆయన శుక్రవారం ఉదయం దేశ రాజధానికి విచ్చేశారు. తన సతీమణి ఉపాసనతో  దిల్లీకి వచ్చిన ఆయనకు ఎయిర్‌పోర్ట్‌ వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు. ‘జై చరణ్‌’ అంటూ నినాదాలు చేశారు. ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. అభిమానులకు అభివాదం చేసిన అనంతరం రామ్‌చరణ్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘మా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని వీక్షించి.. ‘నాటు నాటు’ను సూపర్‌హిట్‌ చేసిన ప్రతి భారతీయ సినీ ప్రియుడికి, నా అభిమానులకు ధన్యవాదాలు. ‘నాటు నాటు’ మా ఒక్కరి పాట మాత్రమే కాదు. ఇది మీ అందరి పాట. దేశ ప్రజలే దీన్ని ఆస్కార్‌కు తీసుకువెళ్లారు’’ అని చెర్రీ పేర్కొన్నారు.

దిల్లీకి ఎందుకంటే:

‘ఆస్కార్‌’ను గెలుపొందిన అనంతరం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ సభ్యులు ఒక్కొక్కరిగా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో చరణ్‌ సైతం నగరానికి రావాల్సి ఉంది. అయితే, శుక్రవారం మధ్యాహ్నం ఆయన దిల్లీలో జరగనున్న పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీని సాయంత్రం కలవనున్నారు. ఈ నేపథ్యంలో చరణ్‌-ఉపాసన దంపతులు ఈరోజు రాత్రి వరకూ అక్కడే ఉంటారు. అనంతరం హైదరాబాద్‌ వచ్చే అవకాశం ఉంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు