Ram charan: ఆస్కార్‌ వేదికపై ‘నాటునాటు’.. రామ్ చరణ్‌ స్పందనిదే!

ఆస్కార్‌ వేదికపై నాటునాటు డ్యాన్స్ వీడియో ప్రదర్శించడంపై రామ్ చరణ్‌ ఆనందం వ్యక్తంచేశారు.

Published : 12 Mar 2024 16:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌ వేదికపై ఈ ఏడాది కూడా ‘ఆర్‌ఆర్ఆర్’ (RRR) మెరిసిన సంగతి తెలిసిందే. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌ వేదికగా జరిగిన ఈ వేడుకలో ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో అవార్డును ప్రకటించే క్రమంలో తెరపై ‘నాటునాటు’ పాటను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. తాజాగా స్టార్ హీరో రామ్‌ చరణ్‌ (Ram charan) ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేశారు. ‘ఆస్కార్‌ స్టేజ్‌పై ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి కనిపించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది నిజంగా సర్‌ప్రైజ్‌. ఎంతో గౌరవంగా అనిపిస్తుంది’ అని వీడియోను తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌లను ఈ హీరో ఫ్యాన్స్ షేర్‌ చేస్తున్నారు.

షూటింగ్‌లో నిజంగానే పాము కాటేసింది.. ఆ హిట్‌ సినిమాకు 25 ఏళ్లు..

ప్రస్తుతం రామ్ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’లో నటిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రమిది. కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. రాజకీయం నేపథ్యంలో సాగే ఈ సినిమాని ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఇందులోని పాటను విడుదల చేయనున్నట్లు టాక్‌. ఈ సినిమాతో పాటు బుచ్చిబాబు దర్శకత్వంలో స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ చిత్రం రానుంది. జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor)కథానాయిక. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని