Ranveer-Deepika: సీక్రెట్‌ ఎంగేజ్‌మెంట్‌పై ప్రశ్న.. రణ్‌వీర్‌ ఏమన్నారంటే..!

చిట్‌చాట్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’ మళ్లీ మొదలైంది. అక్టోబర్‌ 26 నుంచి సరికొత్త సీజన్‌ ప్రసారం కానుంది.

Published : 23 Oct 2023 13:33 IST

ముంబయి: ‘కాఫీ విత్‌ కరణ్‌’ (Koffee With Karan)తో వ్యాఖ్యాతగానూ పేరు తెచ్చుకున్నారు బాలీవుడ్‌ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ (Karan Johar). దాదాపు ఏడు సీజన్ల నుంచి ఈ టాక్‌ షో ప్రేక్షకులను అలరిస్తోంది. అక్టోబర్‌ 26 నుంచి ‘కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 8’ ప్రారంభం కానుంది. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఇది ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఫస్ట్‌ ఎపిసోడ్‌ ప్రోమో విడుదలైంది. ఇందులో రణ్‌వీర్‌ సింగ్‌-దీపికా పదుకొణె అతిథులుగా పాల్గొన్నారు.

Leo: ‘లియో’ మిశ్రమ స్పందనలు.. లోకేశ్‌ కనగరాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..!

తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఎన్నో విశేషాలను కరణ్‌ షోలో వీళ్లు పంచుకున్నారు. ఇందులో భాగంగా.. ‘సీక్రెట్‌ ఎంగేజ్‌మెంట్‌’ గురించి కరణ్‌ ప్రశ్నించగా.. ‘‘వేరే ఎవరో ఆమెకు ప్రపోజ్‌ చేసేలోపు నేనే చెప్పేయాలనుకున్నా. అలా 2015లో నేను ఆమెకు ప్రపోజ్‌ చేశా. ఆనాడే మేమిద్దరం దగ్గరయ్యాం. మా రిలేషన్‌ మొదలైంది’’ అని రణ్‌వీర్‌ బదులిచ్చారు. దీనిపై దీపిక స్పందిస్తూ.. ‘‘అడ్వాన్స్‌డ్‌ బుకింగ్‌’’ అని నవ్వుతూ చెప్పారు. అనంతరం ఆమె ‘ఫైటర్‌’ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘ఆన్‌ స్క్రీన్‌పై హృతిక్‌రోషన్‌తో నా కెమిస్ట్రీ అద్భుతంగా ఉండనుంది. ప్రేక్షకులు త్వరలోనే చూడనున్నారు’’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెటిజన్లను అలరిస్తోంది. 2013లో విడుదలైన ‘రామ్‌ లీలా’ కోసం దీపిక-రణ్‌వీర్‌ తొలిసారి కలిసి వర్క్‌ చేశారు. ఈ సినిమా టైమ్‌లో దీపికతో ఆయన ప్రేమలో పడ్డారు. 2018లో దీపిక-రణ్‌వీర్‌ వివాహం జరిగింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు