Rashmika: ఆ సినిమా చూసి ఏడ్చేశా.. ట్వీట్‌ చేసిన నేషనల్‌ క్రష్‌

తాజాగా విడుదలైన ఓ తెలుగు చిత్రాన్ని ఉద్దేశిస్తూ నటి రష్మిక (Rashmika) ట్వీట్‌ చేశారు. ఆ సినిమా చూసి తాను ఉద్వేగానికి గురయ్యానని చెప్పారు.

Published : 16 Jul 2023 01:35 IST

హైదరాబాద్‌: తాజాగా విడుదలైన ఓ యూత్‌ఫుల్‌ ప్రేమకథా చిత్రాన్ని చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని నటి రష్మిక (Rashmika) తెలిపారు. ఆ సినిమాలోని సీన్స్‌ తన మదిలో ఎంతోకాలం పాటు నిలిచిపోతాయని చెప్పారు. అలాగే, సదరు చిత్రబృందం మొత్తానికి ఆమె అభినందనలు తెలిపారు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..

ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (vaishnavi chaitanya), విరాజ్‌ అశ్విన్‌ (Viraj Aswani) ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘బేబీ’ (Baby). గురువారం రాత్రి సినీ తారల కోసం హైదరాబాద్‌లో వేసిన ప్రీమియర్‌కు రష్మిక విచ్చేసిన విషయం తెలిసిందే. సినిమా చూసిన అనంతరం ఆమె ఎమోషనల్‌గా బయటకు వచ్చిన వీడియోలు సైతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే ఆమె తాజాగా చిత్రబృందాన్ని మెచ్చుకుంటూ ట్వీట్‌ చేశారు. సినిమా తన కెంతో నచ్చిందని.. నటీనటులు అద్భుతంగా యాక్ట్‌ చేశారని.. వాళ్ల ప్రదర్శనతో తాను కన్నీళ్లు పెట్టుకున్నానని అన్నారు.

సమంత ఆధ్యాత్మిక యాత్ర.. కృతి కొంటె చూపులు.. చీపురు పట్టిన అనుపమ

‘కొబ్బరిమట్ట’, ‘హృదయ కాలేయం’ చిత్రాలను తెరకెక్కించిన సాయి రాజేశ్‌ ఈ సినిమాని రూపొందించారు. ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యూత్‌ నుంచి విశేష స్పందన సొంతం చేసుకుంది. ఈ సినిమా చూశాక తమ ఫస్ట్‌ లవ్‌ గుర్తుకు వచ్చిందంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. అలాగే, నటీనటుల పెర్ఫార్మెన్స్‌ను ప్రశంసిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని