Raveeena: మోకాళ్లకు దెబ్బలు.. అనారోగ్యం.. ఆ సెన్సేషనల్‌ సాంగ్‌ వెనుక కష్టాలివే..!

బాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఓ వర్షం సాంగ్‌ చిత్రీకరణలో ఎదురైన ఇబ్బందుల గురించి నటి తాజాగా స్పందించారు.

Published : 10 Sep 2023 02:08 IST

ముంబయి: బాలీవుడ్‌ చిత్రాల్లో వర్షం పాటలు కోకొల్లలు. ఇప్పటివరకూ ఎన్ని వర్షం డ్యూయెట్లు వచ్చినా.. ‘టిప్‌ టిప్‌ బర్‌సా పానీ’ (Tip Tip Barsa Pani) మాత్రం ఎప్పటికీ ఒక సెన్సేషనే. ‘మోహ్రా’లో అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) - రవీనా టాండన్‌లపై చిత్రీకరించిన ఈ పాట ఓ సూపర్‌ డూపర్‌ హిట్‌. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఈ పాట చిత్రీకరణ సమయంలో చోటుచేసుకున్న ఇబ్బందుల గురించి నటి రవీనా టాండన్‌ (Raveeena Tandon) తాజాగా వెల్లడించారు.

ఇషా బైక్‌ రైడ్‌.. రకుల్‌, తమన్నా స్టైలిష్‌ లుక్స్‌.. రాశీఖన్నా చిరునవ్వులు..!

‘‘నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌లో ఈ పాటను చిత్రీకరించారు. చుట్టూ ఇనుప చువ్వలు.. పరిసరాలు అపరిశుభ్రం ఉన్నాయి. దానివల్ల కాళ్లకు చెప్పుల్లేకుండా షూట్‌లో పాల్గొనడం నాకెంతో ఇబ్బందిగా అనిపించింది. చీర ధరించి వర్షంలో అలాంటి మూమెంట్స్‌ చేయడం కోసం కష్టపడాల్సి వచ్చింది. డ్యాన్స్‌ చేస్తున్నప్పుడు కాళ్లకు గాయాలు కాకుండా ఉండేందుకు Knee pads వేసుకున్నా. తీరా, ఇంటికి వెళ్లి చూసుకుంటే మోకాళ్లకు గాయాలయ్యాయి. tetanus ఇంజెక్షన్స్‌ తీసుకోవాల్సి వచ్చింది. రెండు రోజుల తర్వాత నేను అనారోగ్యానికి గురయ్యా. ఇలా ఆ పాట షూట్‌లో ఇబ్బందులు పడ్డా. మీకు స్క్రీన్‌పై కనిపించే గ్లామర్‌ వెనుక ఇలాంటి ఎన్నో కథలు ఉంటాయి. ఇబ్బందులు పడినప్పటికీ పాటకు వచ్చిన రెస్పాన్స్‌కు మేము ఎంతో ఆనంద పడ్డాం’’ అని తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రవీనా టాండన్‌ చెప్పారు. ఇక, ఇదే పాటను 2021లో విడుదలైన ‘సూర్యవంశీ’లో రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే. అక్షయ్‌కుమార్‌ - కత్రినాకైఫ్‌పై దీనిని రీక్రియేట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని