Rajamouli: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సరికొత్త రికార్డు.. సంతోషంలో దర్శకధీరుడు

రామ్‌చరణ్‌ (Ram Charan) - ఎన్టీఆర్‌ (NTR) ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR). ఇప్పటికే పలు విదేశీ అవార్డులు సొంతం చేసుకుని రికార్డు సృష్టించిన ఈ చిత్రం తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

Updated : 28 Jan 2023 14:00 IST

హైదరాబాద్‌: రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రం మరో రికార్డు అందుకుంది. జపాన్‌ దేశంలో అత్యధిక సెంటర్లలో వందరోజులు పూర్తి చేసుకుంటోన్న తొలి భారతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఘనత దక్కించుకుంది. ఈ విషయంపై రాజమౌళి ఆనందం వ్యక్తం చేశారు. జపాన్‌లోని 114 కేంద్రాల్లో శత దినోత్సవం చేసుకుంటోన్న తొలి భారతీయ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అని ఉన్న ఓ పోస్టర్‌ని ఆయన షేర్‌ చేశారు.

‘‘మునపటి రోజుల్లో ఒక సినిమా 100 రోజులు, 175 రోజులు లేదా అంతకు మించి ఆడితే అది చాలా పెద్ద విషయం. ఆ రోజులన్నీ మధుర జ్ఞాపకాలే. కాలక్రమేణా వ్యాపారం తీరు మారింది. కానీ, ఇప్పుడు జపాన్‌లోని సినీ ప్రియులు మాకు మళ్లీ ఆ రోజుల్ని గుర్తు చేశారు. మేము తిరిగి ఆ ఆనందాన్ని పొందేలా చేశారు. లవ్‌ యూ జపాన్‌, థ్యాంక్యూ’’ అని రాజమౌళి పేర్కొన్నారు. దీనిపై సినీ ప్రియులు చిత్రబృందానికి కంగ్రాట్స్‌ చెబుతున్నారు. రామ్‌చరణ్‌ - ఎన్టీఆర్‌ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా గతేడాది విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని గతేడాది అక్టోబర్‌ నెలలో ఈ చిత్రాన్ని జపాన్‌లో విడుదల చేశారు. ఆ దేశంలోనూ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని