Salaar: ‘సలార్‌’ మొదటి భాగంలోనే ప్రేక్షకులు దాన్ని గమనిస్తారు..

‘సలార్‌’ (Salaar) విడుదల తేదీ సమీపిస్తుండటంతో నిర్మాత వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. తాజాగా ఆయన ‘సలార్‌’ పార్ట్‌2 గురించి కూడా అప్‌డేట్‌ ఇచ్చారు.

Published : 15 Dec 2023 15:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సలార్’ (Salaar). ఈ సినిమా డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ ప్రచారం జోరు పెంచారు. వరుస ఇంటర్వ్యూలతో ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఇక ‘సలార్‌’ రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. తాజాగా దీని రెండో భాగం అప్‌డేట్‌ గురించి ఆయన మాట్లాడారు.

‘‘సలార్‌’ రెండో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయింది. మొదటి భాగాన్ని చూసిన ప్రేక్షకులకు సినిమాకు కొనసాగింపు ఉంటుందని స్పష్టంగా అర్థమవుతుంది. రెండు భాగాలు చూస్తేనే సినిమా పూర్తవుతుందని వాళ్లు గమనిస్తారు. ‘సలార్‌: సీజ్‌ ఫైర్‌’ (Salaar: Part 1 Ceasefire) విడుదలయ్యాక ప్రశాంత్ నీల్‌ కొన్ని నెలలు విరామం తీసుకుంటారు. వచ్చే ఏడాదిలోనే పార్ట్‌ 2 షూటింగ్‌ను ప్రారంభిస్తాం’’ అని చెప్పారు. ఇక తాజాగా ఆయన మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సలార్‌’ బ్లాక్‌ బస్టర్ అవుతుందని పూర్తి నమ్మకముందన్నారు. ఈ సినిమాలో యశ్‌ లేరని తేల్చిచెప్పారు. మరోవైపు కౌంట్‌డౌన్‌లో భాగంగా చిత్రబృందం రోజుకో పోస్టర్‌ను విడుదల చేస్తోంది.

కావాలనే ఆ సమయంలో అమ్మను దూరం పెట్టాను: జాన్వీ కపూర్‌

ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై సినీ ప్రియులు అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా విడుదలైన ‘సూరీడే’ పాట కూడా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు పనిచేసిన కెమెరామెన్‌ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను కూడా అభిమానులు షేర్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాకు వేయనంత భారీ సెట్‌ దీనికి వేసినట్లు ఆయన చెప్పారు. ‘కేజీఎఫ్‌’ చిత్రానికి మించి ఐదు రెట్లు ‘సలార్’ ఉంటుందన్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతి బాబు, ఈశ్వరీరావు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని