Hanuman: లేటెస్ట్‌ హిట్ ‘హనుమాన్‌’పై సమంత రివ్యూ

‘హనుమాన్‌’ సినిమా అద్భుతంగా ఉందని నటి సమంత (Samantha) ప్రశంసించారు. ఈ చిత్రంపై ఆమె రివ్యూ ఇచ్చారు.

Published : 18 Jan 2024 17:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది ‘హనుమాన్‌’ (Hanuman). సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రంపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఈ సినిమా రివ్యూను పోస్ట్‌ చేశారు.

‘‘మనల్ని చిన్న పిల్లల్ని చేసే సినిమాలు ఉత్తమమైనవి. ‘హనుమాన్‌’లో ప్రతి అంశం నన్ను ఆకట్టుకుంది. విజువల్స్, కామెడీ, సంగీతం.. ఇలా ఎన్నో అద్భుతమైన అంశాలతో వెండితెరపై హనుమంతుడు చేసిన మ్యాజిక్‌ ఈ చిత్రం. ఇంత గొప్ప మూవీని తీసినందుకు ప్రశాంత్‌ వర్మకు ధన్యవాదాలు. దీని సీక్వెల్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. తేజ సజ్జా తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అమాయకుడైన హనుమంతు పాత్ర ఈ సినిమాకు హార్ట్‌. వీఎఫ్ఎక్స్‌ ఎఫెక్ట్‌లు సినిమాకు మరింత అందాన్నిచ్చాయి’’ అంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

‘ఈగల్‌’తో క్లాష్‌.. మేము డేట్‌ మార్చుకోలేం: సందీప్‌ కిషన్‌

తాజాగా నటుడు తేజ సజ్జాను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆయన నివాసంలో సత్కరించారు. ప్రతి టికెట్‌ నుంచి అయోధ్య రామమందిరానికి రూ.5 విరాళంగా ఇవ్వడం అభినందనీయమని ప్రశంసించారు. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జనవరి 12న విడుదలై భారీ వసూళ్లు సొంతం చేసుకుంటోంది. ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. సూపర్‌ హీరో కథకు ఇతిహాసంతో ముడిపెట్టి.. నేటివిటీ మిస్‌ కాకుండా చూపించడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు క్యూ కడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని