Sita Ramam: ఇక్కడ నటులు లేరా.. మలయాళ హీరోని తీసుకురావాలా?: సంతోష్‌ అసహనం

తెలుగు చిత్రం కోసం మలయాళ హీరోని తీసుకురావాలా? ఇక్కడ ఎవరూ లేరా? మలయాళ ఆర్టిస్టులు లేకుండా మేం తెలుగు సినిమాలు చేయలేమా?’ అంటూ నటుడు సంతోష్‌ శోభన్‌ అసహనం వ్యక్తం చేశారు.

Published : 03 Aug 2022 02:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘తెలుగు చిత్రం కోసం మలయాళ హీరోని తీసుకురావాలా? ఇక్కడ ఎవరూ లేరా? మలయాళ ఆర్టిస్టులు లేకుండా మేం తెలుగు సినిమాలు చేయలేమా?’ అంటూ నటుడు సంతోష్‌ శోభన్‌ (Santosh Shoban) అసహనం వ్యక్తం చేశారు. ‘సీతారామం’ (Sita Ramam) సినిమాను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇది సీరియస్‌గా అన్న మాట కాదండోయ్‌.. ఓ పథకం ప్రకారం చాలా సరదాగా చిత్రీకరించిన ఓ వీడియోలోని దృశ్యం. అసలు విషయం ఏంటంటే.. మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా తెలుగు దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రం ‘సీతారామం’. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. రష్మిక, సుమంత్‌, తరుణ్‌ భాస్కర్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ‘సీతారామం: స్వరాలు’ (Sita Ramam Swaralu) పేరుతో చిత్ర బృందం మ్యూజికల్‌ కాన్సెర్ట్‌ నిర్వహించింది. దీనికి విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘ఈటీవీ’లో (ETV) ఇటీవల ప్రసారమైన ఈ వేడుకను చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. పలు భాగాలుగా విడుదలైన ఈ వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. సంతోష్‌ శోభన్‌ ఫన్నీ కాన్సెప్ట్‌ వీటిల్లోని ఓ భాగమే.

ఈ వేడుకకు వచ్చేముందు సంతోష్‌ శోభన్‌, నటి మాళవిక నాయర్‌ ‘సీతారామం’ గురించి ఏమనుకున్నారో సీక్రెట్‌గా చిత్రీకరిస్తారు యాంకర్‌ సుమ. ఆ వీడియోను కార్యక్రమంలో అందరి ముందు ప్రదర్శిస్తారు. అనంతరం, సంతోష్‌, మాళవికలను సుమ వేదికపైకి ఆహ్వానిస్తారు. ఈ క్రమంలోనే ఇదంతా వారు కావాలనే చేశారని తెలిసిపోతుంది. అయినా సంతోష్‌ ఒప్పుకోరు. ‘తెలుగు సినిమాల గురించి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తేనే దుల్కర్‌ మనవాడు అనుకుంటా’ అంటూ హంగామా చేశారు. ఈ పరీక్షలో దుల్కర్‌ పాసయ్యారు. ఇంతకీ సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ ఇక్కడ ప్రత్యక్షమవడానికి కారణమేంటి? అని అనుకుంటున్నారా.. ఈ ఇద్దరు జంటగా తెరకెక్కుతున్న ‘అన్నీ మంచి శకునములే’ చిత్రాన్ని వైజయంతి మూవీస్‌ నెట్‌వర్క్‌ (స్వప్న సినిమాస్‌) నిర్మిస్తోంది. మరి, ఇంకెందుకు ఆలస్యం ‘సీతారామం స్వరాలు’ వినేయండి.. తారల నవ్వులు ఆస్వాదించండి..Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని