Shah Rukh Khan: మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ సెలబ్రిటీగా షారుక్‌.. టాప్‌2లో ఎవరంటే!

ఇండియన్‌ మూవీ డేటాబేస్‌ వాళ్లు విడుదల చేసిన పాపులర్‌ ఇండియన్‌ సెలబ్రిటీ 2023 జాబితాలో హీరో షారుక్‌ ఖాన్‌ మొదటి స్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఆయన రెండు సూపర్ హిట్‌లతో అలరించిన సంగతి తెలిసిందే.

Updated : 22 Nov 2023 17:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌కు (Shah Rukh Khan) ఉన్న ఫాలోయింగ్‌ తెలిసిందే. ఇక ఈ ఏడాది ప్రారంభంలోనే ‘పఠాన్‌’తో సూపర్‌ హిట్‌ను అందుకున్న షారుక్‌.. ‘జవాన్‌’తో దాన్ని కొనసాగించి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారారు. దీంతో ఈ ఏడాది పాపులర్‌ ఇండియన్‌ సెలబ్రిటీ లిస్ట్‌లో టాప్‌లో నిలిచారు. ఐఎమ్‌డీబీ (IMDb) విడుదల చేసిన ఈ లిస్ట్‌లో షారుక్‌ ఖాన్‌ మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (ఐఎమ్‌డీబీ) నవంబర్‌ 22న మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ స్టార్స్‌ లిస్ట్‌ను విడుదల చేసింది. ప్రతి నెలా ఈ వెబ్‌సైట్‌ను చూసే 20కోట్ల మంది యూజర్ల రియల్‌ పేజ్‌ వ్యూస్‌ ఆధారంగా ఈ లిస్ట్‌ను తయారుచేస్తుంది. ఈ ఏడాది వరుస విజయాలతో అంతర్జాతీయ స్థాయిలో షారుక్ తన హవా కొనసాగించారు. ఆయన నటించిన రెండు సినిమాలు కలిపి రూ.2200కోట్లకు పైగా వసూలు చేశాయి. దీంతో ఈ బాలీవుడ్‌ బాద్‌షా 2023లోనే మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ సెలబ్రిటీగా నిలిచారు. ఇక టాప్2లో బాలీవుడ్ హీరోయిన్‌ అలియాభట్‌ నిలిచారు. అలాగే మూడో స్థానంలో దీపికా పదుకొణె ఉన్నారు. వీళ్లతో పాటు ‘జవాన్‌’లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న నయనతార, విజయ్‌ సేతుపతి కూడా టాప్ టెన్‌లో స్థానం సొంతం చేసుకున్నారు.

ఆ విషయాన్ని తట్టుకోలేకపోయా.. రెండు సార్లు గుండెపోటుకు గురయ్యా: అనురాగ్‌ కశ్యప్‌

ఈ సందర్భంగా అలియా భట్‌ (Alia Bhatt) తన అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. ‘ఐఎమ్‌డీబీ నిజంగా ప్రేక్షకుల ఎంపికకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ లిస్ట్‌లో టాప్‌2లో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. నన్ను అభిమానించే అందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకులకు వినోదాన్ని ఇచ్చేందుకు నిరంతరం కృషి చేస్తుంటా. మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథలు, పాత్రలను ఎంచుకుంటానని హామీ ఇస్తున్నాను’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని