Adipurush: ఓం రౌత్‌ను నమ్మండి.. ఆదిపురుష్‌ అద్భుతంగా ఉంటుంది..: శరద్‌ కేల్కర్‌

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా సినిమా ఆదిపురుష్ (Adipursh).  ఓం రౌత్‌ దర్శకత్వంలో రానున్న ఈ మైథలాజికల్‌ మూవీ టీజర్‌ కొన్ని విమర్శలను ఎదుర్కొంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి శరద్‌ కేల్కర్‌ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా అద్భుతంగా ఉండనుందని ఓం రౌత్‌ను ప్రశంసించారు. 

Published : 26 Oct 2022 11:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌(Om Raut) దర్శకత్వంలో ప్రభాస్‌(Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్ (Adipursh)‌. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్ర టీజర్‌ విడుదలైనప్పటి నుంచి ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తోంది. పాన్‌ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రకు బాలీవుడ్‌ నటుడు శరద్‌ కేల్కర్‌ డబ్బింగ్‌ చెప్పనున్నారు. ఇటీవల ఆయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ ఆదిపురుష్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘ఆదిపురుష్‌ సినిమా అద్భుతంగా ఉండనుంది. నేను ఇంకా పూర్తిగా డబ్బింగ్‌ చెప్పలేదు. కానీ, నేను ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చూశాను. అవి ఎంతో బాగున్నాయి. ఇంతకు ముందు ఎవ్వరూ ఇటువంటి ప్రయత్నం చేయలేదు. ఓం రౌత్‌ అద్భుతమైన దర్శకుడు. అతడు సినిమాను చూసే దృష్టికోణం వేరు. సినిమాలపై ఆయనకు అపారమైన జ్ఞానం ఉంది. ఇలాంటి వాళ్లు ఈ రోజుల్లో మనకు అవసరం. టీజర్‌ చూసి ఆయన్ని విమర్శించే వారికి నేను చెప్పేది ఒక్కటే.. ఓం రౌత్‌ను నమ్మండి. ఆయన త్వరలోనే మీరు ఆశ్చర్యపోయే సినిమాను అందించనున్నారు. ఆదిపురుష్‌ అద్భుత విజయం సాధిస్తుందని నేను కచ్చితంగా నమ్ముతున్నాను’’ అని చెప్పారు. ప్రస్తుతం శరత్‌ కేల్కర్‌ ‘హర హర మహాదేవ’ సినిమాతో బిజీగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని