Shruthi Haasan: సాయిపల్లవిలా నేను ఉండను: శ్రుతిహాసన్‌

‘ప్రేమమ్‌’ సినిమా సమయంలో అందరూ తనని విపరీతంగా ట్రోల్‌ చేశారని నటి  శ్రుతిహాసన్‌ అన్నారు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. సినిమా అనే రంగుల ప్రపంచంలోకి....

Published : 20 Feb 2022 13:16 IST

హైదరాబాద్‌: ‘ప్రేమమ్‌’ సినిమా సమయంలో అందరూ తనని విపరీతంగా ట్రోల్‌ చేశారని నటి  శ్రుతిహాసన్‌ అన్నారు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. సినిమా అనే రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత పొగడ్తలు, తిట్లు రెండూ వస్తుంటాయని అన్నారు. ‘ప్రేమమ్‌’ రోజుల్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘నేను ఇప్పటివరకూ నటించిన సినిమాలన్నింటితో పోలిస్తే ‘ప్రేమమ్‌’కు ఎక్కువ ట్రోలింగ్స్ ఎదుర్కొన్నా. సూపర్‌ హిట్‌ మలయాళం రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో నా నటన ఏం బాలేదని, హీరో (నాగచైతన్య) కంటే నేనే వయసులో పెద్దదానిలా కనిపిస్తున్నానన్నారు. ‘ప్రేమమ్‌’ ఆఫర్‌ వచ్చినప్పుడు నేనూ చేయకూడదనే అనుకున్నా. కానీ, నా స్టైల్‌లో ఆ పాత్రని క్రియేట్‌ చేయాలని అనుకున్నా. ఎవరు ఏం అనుకున్నా పర్వాలేదనుకుంటూనే ఆ ప్రాజెక్ట్‌ ఓకే చేశా. నాకూ ‘ప్రేమమ్‌’ ఒరిజినల్‌ నచ్చింది. కానీ, ఏవిధంగానూ నేను సాయిపల్లవిలా ఉండను. అందుకే ఆమెలా నటించలేదు. అదృష్టం కొద్ది మా సినిమా హిట్‌ అయ్యింది. అప్పుడు నేనెంతో సంతోషించా’’ అని శ్రుతిహాసన్‌ తెలిపారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని