SJ Surya: మహేశ్‌కు హిట్ ఇవ్వనందుకు ఇంకా బాధపడుతున్నా..: సూర్య
సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో తాను ఎప్పటికైనా ఓ మంచి చిత్రాన్ని తెరకెక్కిస్తానని అన్నారు ఎస్.జె.సూర్య. ‘నాని’ సినిమా వైఫల్యంపై ఆయన స్పందించారు.
హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్ బాబు (MaheshBabu) హీరోగా తాను దర్శకత్వం వహించిన ‘నాని’ సినిమా వైఫల్యంపై దర్శకుడు, నటుడు ఎస్.జె.సూర్య (Surya) తాజాగా స్పందించాడు. సినిమా పరాజయం తర్వాత మహేశ్ అన్న ఓ మాట తననెంతో బాధపెట్టిందని చెప్పాడు.
‘‘నాని’ సినిమా విషయంలో నాకింకా బాధగానే ఉంది. హీరో కావాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి వచ్చా. నటుడిగా ఎదగడం కోసం మొదట దర్శకుడిని అయ్యాను. ప్రతి చిత్రాన్ని ప్రేమ, ఉత్సాహంతో చేశా. కానీ, ‘నాని’ అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమా విడుదలయ్యాక ఓసారి మహేశ్.. ‘మీరు ఈ చిత్రాన్ని ఎంత ఇష్టపడి చేశారో నాకు తెలుసు. ఫలితాన్ని పక్కనపెడితే మిమ్మల్ని, మీ వర్క్‌ను నేను అభిమానిస్తున్నా’ అని అన్నారు. ఆయన మాట నాకింకా బాధను కలిగించింది. పవన్ కల్యాణ్‌కు హిట్ ఇచ్చా. మహేశ్‌కు ఇవ్వలేకపోయాననే బాధ ఉండిపోయింది. అయితే, ప్రస్తుతం నా దృష్టి అంతా నటనపైనే ఉంది. నటనపై మక్కువ తగ్గితే.. మళ్లీ దర్శకుడిగా మహేశ్‌తో సినిమా చేసి.. హిట్ అందుకుంటా’’ అని ఆయన వివరించారు.
ఆయన ప్రస్తుతం ‘వదంతి’ విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఇది విడుదల కానుంది. ఇందులో ఆయన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈసినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఆయన ‘నాని’ గురించి స్పందించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
రామ్ రామ్ అనమంటూ కుక్కకు ఎమ్మెల్యే శిక్షణ
-
Movies News
Director Sagar: సీనియర్ దర్శకుడు సాగర్ కన్నుమూత
-
Politics News
Balineni: నిరూపించలేకపోతే పోటీనుంచి తప్పుకొంటారా?: కోటంరెడ్డికి బాలినేని సవాల్
-
General News
Top Ten News @ 9 AM: బడ్జెట్ ప్రత్యేకం.. ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Buggana: సీఎం ఎక్కడుంటే అదే పరిపాలన రాజధాని: బుగ్గన
-
World News
Pakistan: ముజాహిదీన్లను సృష్టించి తప్పు చేశాం: పార్లమెంటులో పాక్ మంత్రి