Pawan Kalyan: ‘బ్రో’ రిలీజ్‌.. థియేటర్‌ వద్ద అకీరా సందడి..!

‘వినోదయ సిత్తం’కు రీమేక్‌గా రూపుదిద్దుకున్న చిత్రం ‘బ్రో’ (BRO). పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈచిత్రానికి సముద్రఖని దర్శకుడు. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

Updated : 28 Jul 2023 13:33 IST

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ (Powerstar PawanKalyan) అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు వచ్చేసింది. పవన్‌కల్యాణ్‌ కీలకపాత్రలో నటించిన ‘బ్రో’ (BRO) శుక్రవారం విడుదలైంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద పండుగ కళ కనిపించింది. ఆయా థియేటర్ల వద్ద భారీ కటౌట్స్‌ ఏర్పాటు చేసి.. అభిమానులు తీన్‌మార్‌ డ్యాన్స్‌లు చేశారు. ఇక, పవన్‌ తనయుడు అకీరానందన్‌ సైతం ‘బ్రో’ చిత్రాన్ని వీక్షించారు. హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌కు వచ్చిన అకీరా.. అభిమానులతో కలిసి సినిమా చూశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

రివ్యూ: బ్రో.. పవన్‌, సాయిధరమ్‌ తేజ్‌ల మూవీ మెప్పించిందా?

పవన్‌ వింటేజ్‌ సాంగ్స్‌:

‘బ్రో’లో పవర్‌స్టార్‌ అభిమానులను ఆకర్షిస్తోన్న విషయాల్లో ఒకటి వింటేజ్‌ సాంగ్స్‌ రీ క్రియేషన్‌. పవన్‌కల్యాణ్‌ నటించిన ‘తమ్ముడు’, ‘జల్సా’, ‘భీమ్లానాయక్‌’ చిత్రాల్లోని కొన్ని పాటలను ఈ సినిమాలో రీ క్రియేట్‌ చేశారు. ఆ సీక్వెన్స్‌ని ఉద్దేశిస్తూ ఫ్యాన్స్‌ సోషల్‌మీడియాలో వరుస ట్వీట్‌ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత పవన్‌కల్యాణ్‌ని ఇలాంటి లుక్‌లో చూడటం ఆనందంగా ఉందంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని