Jailer: కథ చిన్నారుల చుట్టూ.. సినిమా హిట్టు.. ఇప్పుడు ‘జైలర్’ వంతు?
రజనీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ తెరకెక్కించి చిత్రం ‘జైలర్’. తాత, మనవడి సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమా శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా గతంలో ఇదే ఇతివృత్తంతో వచ్చిన కొన్ని సినిమాల విశేషాలు చూద్దాం...
పిల్లల చుట్టూ తిరిగే కథలతో సినిమాలు తక్కువ సంఖ్యలో తెరకెక్కుతుంటాయి. కానీ, సెంటిమెంట్‌తోపాటు యాక్షన్ హంగులూ అద్దుకున్న ఆయా చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పించి, విజయాన్ని అందుకుంటాయి. ఇదే ఇతివృత్తంతో తెరకెక్కిన రజనీకాంత్ ‘జైలర్’ శుక్రవారం (jailer release date 2023) విడుదల కానున్న సందర్భంగా అలాంటి కొన్నింటిపై ఓ లుక్కేద్దాం..
కూతురు కోసం ఖైదీ సాహసం
అతడో కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ ఖైదీ. సత్ర్పర్తన కారణంగా శిక్ష తగ్గించి అధికారులు అతడిని విడుదల చేస్తారు. అప్పటి వరకు చూడని తన కూతురిని కలిసేందుకు ఎంతో ఆనందంగా బయలుదేరతాడు. అదే దారిలో చోటు చేసుకున్న ఓ ప్రమాదం నుంచి పోలీసు అధికారుల్ని కాపాడాల్సిన పరిస్థితి అతడికి ఎదురవుతుంది. తొలుత దానికి అంగీకరించకపోయినా తన చిన్నారి భవిష్యత్తు కోసం ఆ సాహసం చేస్తాడు. ఇది ఏ సినిమా స్టోరీనో ఇప్పటికే అర్థమై ఉంటుందిగా. అవును.. కార్తి (Karthi) హీరోగా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తెరకెక్కించిన ‘ఖైదీ’ (Kaithi). ఖైదీగా ఢిల్లీ పాత్రలో కార్తి ఒదిగిపోయారు. ఆయన కూతురిగా బేబీ మోనిక నటించింది. ఢిల్లీ కన్న కూతురిని కలుసుకుంటాడా, లేదా? అనే ఉత్కంఠకు గురిచేసే ఈ సినిమా అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది.
‘సర్దార్’లో ఇలా..
కార్తి హీరోగా దర్శకుడు పి. ఎస్. మిత్రన్ తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘సర్దార్’ (Sardar). ‘వన్ కంట్రీ వన్ పైప్‌లైన్’ అనే ప్రాజెక్టుకు ఓ ప్రైవేటు కంపెనీ శ్రీకారం చుడుతుంది. సామాజిక కార్యకర్త సమీరా థామస్ (లైలా) దాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తుంది. ఆమె ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఆమెపై దేశ ద్రోహి ముద్ర పడడంతో ఆమె కొడుకుని చేరదీసేందుకు ఎవరూ ముందుకురారు. అనాథైన ఆ బాలుడికి ఇన్‌స్పెక్టర్ విజయ్ ప్రకాశ్ (కార్తి) ఎలాంటి సాయం చేశాడు? ఆ పైప్‌లైన్ వెనుక గుట్టును ఎలా బయటపెట్టాడు? అన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమా హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ఏజెంట్ చంద్రబోస్ అలియాస్ సర్దార్ అనే పాత్రలోనూ కార్తి నటించిన సంగతి తెలిసిందే.
క్రూరుడిలో మార్పు తెచ్చే చిన్నారి..
క్రీస్తు పూర్వం 500 సంవత్సరానికి చెందిన త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడు. క్రూరత్వానికి ప్రతీక అతడు. ఏ రాజ్యపైన అయినా కన్నువేస్తే త్రిగర్తల సామ్రాజ్యంలో భాగమవ్వాల్సిందే. ఎదురు తిరిగిన వాడు ఎంతటి వాడైనా తన కత్తి వేటుకు మట్టి కరవాల్సిందే. ఆ కత్తికి రాజ్య కాంక్ష.. అధికార దాహం తప్ప తరతమ భేదాలు లేవు. కనికరం అస్సలు తెలియదు. అధికారానికి అడ్డు వస్తాడేమోనన్న ఉద్దేశంతో తన కవల సోదరుడు దేవదత్తుడినీ చంపాలని ప్రయత్నిస్తాడు. మాయా దర్పణం ద్వారా వర్తమానంలోకి వచ్చిన బింబిసారుడిలో శాంభవి అనే పాప మార్పు తీసుకొస్తుంది. ఎమోషన్‌తో కూడిన ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ మరెదో కాదు ‘బింబిసార’ (Bimbisara). బింబిసారుడు, దేవదత్తుగా కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. శాంభవిగా బేబీ శ్రీదేవి అలరించింది.
మనవడితో విక్రమ్..
ఎమోషన్స్‌ని అంతర్లీనంగా చూపిస్తూ కమల్ హాసన్ (Kamal Haasan) ప్రధాన పాత్రలో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘విక్రమ్’ (Vikram). ఇందులో తాత, మనవడి అనుబంధాన్ని తెరపైకి తీసుకొచ్చి హిట్ కొట్టారు. పోలీసు అధికారైన తన కొడుకు ప్రభంజన్ విధుల్లో భాగంగా మరణిస్తే.. అతడి కొడుకు (మాస్టర్ దర్శన్)ను కంటికి రెప్పలా చూసుకుంటాడు విక్రమ్. బ్లాక్‌స్క్వాడ్ మాజీ ఏజెంట్ అయిన విక్రమ్ (కర్ణన్).. తన కొడుకుని హత్య చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకున్నాడా? విక్రమ్ అయిన తాను కర్ణన్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? తదితర అంశాలతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇందులో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో మెప్పించారు.
‘జైలర్’లోనూ గ్రాండ్‌సన్..
నెల్సన్ (Nelson Dilipkumar) దర్శకత్వం వహించిన ‘జైలర్’ (Jailer) సినిమాలో రజనీకాంత్.. ఆరేళ్ల పిల్లాడికి తాతగా కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే.. తాత, మనవడి మధ్య అనుబంధం ఈ సినిమాలో ప్రధానాంశమని అర్థమవుతుంది. రజనీ ఆ బాలుడి (మాస్టర్ రిత్విక్) బూట్లు తుడవడం, కలసి భోజనం చేయడం తదితర సన్నివేశాలు ఇద్దరూ ఎంత ప్రేమగా ఉంటారో తెలియజేస్తాయి. పదవీ విరమణ అనంతరం ఆనందంగా జీవించే టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్) మళ్లీ ‘యాక్షన్’లోకి దిగడానికి కారణమేంటి? ఈ క్రమంలో మనవడిని చంపబోయే గ్యాంగ్ నుంచి ఎలా రక్షించాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ చిత్రంలో తమన్నా, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీష్రాఫ్, రమ్యకృష్ణ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. దాదాపు రెండేళ్ల తర్వాత రజనీకాంత్ తెరపై సందడి చేయనున్న చిత్రంకావడంతో సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి, గ్రాండ్‌సన్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ‘జైలర్’ ఎంతటి విజయం అందుకుంటుందో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Ranbir Kapoor: ఒకప్పుడు ఫ్లోర్ తుడిచి.. ఇప్పుడు స్టార్‌గా నిలిచి.. రణ్‌బీర్ ప్రయాణమిదీ
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన తాజా చిత్రం ‘యానిమల్’. డిసెంబరు 1న ఈ సినిమా విడుదలకానున్న సందర్భంగా రణ్‌బీర్‌పై ప్రత్యేక కథనం.. -
Pragathi: ఆర్థిక కష్టాలు.. కన్నీళ్లు.. నటి ప్రగతి ఇంత ‘స్ట్రాంగ్’గా ఉండటానికి కారణాలివే..!
ఇటీవల జరిగిన నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిలో కాంస్యాన్ని గెలుచుకున్నారు నటి ప్రగతి. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు. -
Chandra Mohan: తెనాలి రామకృష్ణుడు.. ఆవారా కొడుక్కి తండ్రీ అన్నీ ఆయనే! మిమిక్రీ ఆర్టిస్టుకి దొరకని సహజ నటుడు..
-
Chandramohan: నటి ఫిర్యాదుతో ఆ నిర్ణయం తీసుకున్నా: గతంలో చంద్రమోహన్ పంచుకున్న విశేషాలు
ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. గతంలో పలు ఇంటర్వ్యూల్లో ఆయన పంచుకున్న విశేషాలు..! -
Chandramohan: ‘పదహారేళ్ల వయసు’.. చంద్రమోహన్‌కు నచ్చలేదట..!
Chandramohan: అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ గతంలో పలు ఇంటర్వ్యూలో తన వృత్తి జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో చూద్దాం..! -
Bhagavanth Kesari: ఓ ఆడబిడ్డా.. జర పైలం.. భగవంత్ కేసరి చెప్పిన ‘బ్యాడ్ టచ్’ పాఠం
Bhagavanth Kesari: బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘భగవంత్ కేసరి’. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ఇందులో ‘బ్యాడ్ టచ్’ గురించి చెప్పే సన్నివేశానికి సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. -
Directors turns Villains: దర్శకులు విలన్లుగా కనిపిస్తే.. ‘నా సామిరంగ’!
విలన్లుగా నటించి ప్రేక్షకులను మెప్పించిన/అలరించనున్న దర్శకులపై ప్రత్యేక కథనం. ఏ డైరెక్టర్ ఏ సినిమాలో నటించారంటే? -
రాజమౌళి టు అట్లీ.. దక్షిణాదిలో ఒక్క ఫ్లాప్ లేని దర్శకులు వీరే!
ZERO flop directors: దక్షిణాదిలో కొందరు దర్శకులు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. రాజమౌళి నుంచి అట్లీ వరకూ ఎవరెవరు ఉన్నారో ఓ లుక్ వేయండి. -
Atlee: అట్లీ.. అన్నీ హిట్లే.. అక్కడా.. ఇక్కడా..
‘జవాన్’తో మరో హిట్ అందుకున్న కోలీవుడ్ దర్శకుడు అట్లీ గురించి కొన్ని విశేషాలు మీకోసం.. -
Pawan Kalyan: ఆ నిస్పృహ వెంటాడేది.. అదే చివరి సినిమా కావాలనుకున్నా: పవన్ కల్యాణ్
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి పలు విశేషాలు మీకోసం.. -
Nagarjuna: అదే నాగార్జునలో మార్పు తీసుకొచ్చింది.. వారే ఈ స్థాయిలో నిలబెట్టింది: బర్త్‌డే స్పెషల్
టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున పుట్టినరోజు నేడు. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన గురించి కొన్ని సంగతలు చూద్దాం.. -
Allu Arjun: అల్లు అర్జున్.. యాక్టర్ Also.. డ్యాన్సర్ Also.. బన్ని డ్యాన్స్‌తో అదరగొట్టిన సాంగ్స్ ఇవే!
అల్లు అర్జున్ సినిమాల్లో విశేష ఆదరణ అందుకున్న కొన్ని పాటలివే..! -
Allu Arjun: ఈ పాత్రలు చూస్తే.. ‘ఎత్తిన ప్రతి వేలూ ముడుచుకోవాలి.. జారిన ప్రతి నోరూ మూసుకోవాలి’
అల్లు అర్జున్ కెరీర్లోనే ది బెస్ట్‌గా భావించే పాత్రలు.. పాటలివే..! -
allu arjun: ‘పుష్ప’రాజ్‌కు జాతీయ అవార్డు.. ఈ అంశాలే కారణమా..!
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ నటనకు గాను కేంద్ర ప్రభుత్వం ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘పుష్ప’రాజ్ గురించి ఆసక్తికర అంశాలేంటో చూద్దాం.. -
National Awards 2023: పాత్ర కోసం ప్రాణం పెట్టి.. జాతీయ ఉత్తమ నటిగా నిలిచి...
జాతీయ ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైన అలియా భట్, కృతిసనన్ గురించి ప్రత్యేక కథనం.. -
Chiranjeevi: ఆ అవమానం ఎదుర్కొని.. నం.1 హీరోగా ఎదిగి: చిరంజీవి ప్రయాణమిదీ
ఆగస్టు 22.. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం మీకోసం.. -
Independence Day: స్వాతంత్ర్య దినోత్సవం.. స్ఫూర్తినింపే దేశభక్తి గీతాలు..!
స్ఫూర్తి నింపే దేశభక్తి గీతాలివే..! -
Independence Day: అల్లూరి టు సుభాష్ చంద్రబోస్.. దేశభక్తి రగిలించే సినీ సన్నివేశాలు
ఆగస్టు 15.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశభక్తిని రగిలించే కొన్ని సినిమా సన్నివేశాలు మీకోసం.. -
Chiranjeevi- Rajinikanth: రజనీ స్ఫూర్తితోనే చిరు రీఎంట్రీ.. ఇప్పుడు ఏకంగా బాక్సాఫీస్ వద్ద పోటీ..!
అగ్ర హీరోలు చిరంజీవి, రజనీకాంత్ నటించిన చిత్రాలు ఒక్క రోజు తేడాతో బాక్సాఫీసు వద్ద పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో.. గతంలో ఇలా ఎప్పుడు జరిగిందో చూద్దామా.. -
Mahesh Babu: అనుకోకుండా తెరంగేట్రం చేసి.. సూపర్‌స్టార్‌గా నిలిచి: మహేశ్‌బాబు బర్త్‌డే స్పెషల్
ప్రముఖ నటుడు మహేశ్‌బాబు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం..


తాజా వార్తలు (Latest News)
-
Mrunal Thakur: త్వరలోనే పెళ్లి చేసుకుంటా: మృణాల్ ఠాకూర్
-
Pawan Kalyan: పవన్ కల్యాణ్- సురేందర్ రెడ్డి కాంబో.. నేపథ్యమిదే!
-
‘వరకట్నం’గా BMW, 15 ఎకరాల భూమి డిమాండ్.. వైద్యురాలి ఆత్మహత్య
-
IPL 2024: గుజరాత్ టైటాన్స్‌కు మరో షాక్ తప్పదా! షమి ఫ్రాంఛైజీ మారతాడా?
-
Social Look: కాజల్ వర్కౌట్.. ఫొటోగ్రాఫర్‌గా మారిన లావణ్యత్రిపాఠి
-
Green energy park: అదానీ గ్రీన్ ఎనర్జీ పార్క్.. అంతరిక్షం నుంచి చూసినా కనిపిస్తుందటా..