Anurag Kashyap: అందుకే షారుక్‌, సల్మాన్‌లతో సినిమాలు చేయాలనుకోను: అనురాగ్‌ కశ్యప్‌

షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌లాంటి స్టార్‌ హీరోలతో తాను ఎందుకు సినిమాలు తీయాలనుకోరో దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన ఏమన్నారంటే?

Published : 13 Sep 2023 18:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పాంచ్‌’, ‘బ్లాక్‌ ఫ్రైడే’, ‘గులాల్‌’వంటి విభిన్న కథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ (Anurag Kashyap). 20 ఏళ్ల దర్శకత్వ ప్రస్థానంలో ఆయన స్టార్‌ హీరోలతో పనిచేయలేదు. దానికి గల కారణాన్ని తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ‘‘నేను సినిమాలు తీయడానికే ఇండస్ట్రీలోకి వచ్చినా.. ఒకానొక సమయంలో స్టార్ల వెంటపడడం తప్పలేదు. ‘స్టార్లు లేకుండా నువ్వు ఈ ప్రాజెక్టు చేస్తున్నావ్‌.. ఒకవేళ ఇదే మూవీలో స్టార్లు ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకో’ అని చాలామంది నాకు సలహా ఇచ్చేవారు. స్టార్లుగా పేరొందిన వారికి అశేష అభిమానులుంటారు. ఆ అభిమాన గణాన్ని దృష్టిలో పెట్టుకోవడం వల్ల స్టార్లతో ప్రయోగాత్మక చిత్రాలు తెరకెక్కించడం కష్టం. అందుకే షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan), సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)లాంటి వారితో నేను సినిమాలు చేయాలనుకోను. విదేశీ దర్శకులు.. హీరోల అభిమానుల కోసం సినిమాలు తీయరు. అక్కడ స్వేచ్ఛ ఉంటుంది’’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

కట్టుకున్నోడే చిత్రహింసలు పెట్టి.. యాసిడ్‌ పోస్తానని బెదిరించాడు: సీనియర్‌ నటి జయలలిత

మరో ఇంటర్వ్యూలో ఆయన.. హీరోయిన్‌ అలియా భట్‌ (Alia Bhatt)ను ప్రశంసించారు. దేశంలోనే ఆమె ఉత్తమ నటుల్లో ఒకరని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమెతో ఓ సినిమా తెరకెక్కించాలనుందని చెప్పారు. అనురాగ్‌ దర్శకత్వం వహించిన కొత్త చిత్రం ‘కెన్నెడీ’ (Kennedy) ఓటీటీ ‘జీ 5’ (Zee 5)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. రాహుల్‌ భట్‌, సన్నీ లియోనీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రమిది. అనురాగ్‌లో నటుడున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన తాజా సినిమా ‘హడ్డి’ (Haddi) కూడా అదే ఓటీటీలో ఇటీవల విడుదలైంది. ఇందులో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ మరో ప్రధాన పాత్ర పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని