Sudigali Sudheer: వైభవంగా సుడిగాలి సుధీర్‌ వివాహం.. బుల్లితెరపై!!

‘జబర్దస్త్‌’ ఫేం సుడిగాలి సుధీర్‌ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమ వేదికగా ఆయన ఓ ఇంటివాడయ్యాడు.

Published : 09 Mar 2022 01:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘జబర్దస్త్‌’ ఫేం, బుల్లితెర వ్యాఖ్యాత సుడిగాలి సుధీర్‌ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమ వేదికగా ఆయన ఓ ఇంటివాడయ్యాడు. ఏంటి? ఇదంతా నిజమేనా అనుకుంటున్నారా? కాదులేండి!! స్కిట్‌లో భాగంగా ఈ వివాహ వేడుక సాగింది. ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో ప్రతి ఎపిసోడ్‌ వైవిధ్యంగా ఉంటుందనే విషయం తెలిసిందే. అలా ఈ ఆదివారం అలరించేందుకు ‘సుధీర్‌ పెళ్లిచూపులు’ అనే స్కిట్‌ పెళ్లిని తలపించేలా రూపొందింది. మార్చి 13న ప్రసారంకానున్న ఈ ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలై కనువిందు చేస్తోంది.

నలుగురు అందమైన అమ్మాయిలను (పెళ్లి చూపులు) చూసిన సుధీర్‌ వారిలో ఒకరిని పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్లి చూపుల నేపథ్యంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా సుధీర్‌ను పొగిడి సందడి చేశారు. నలుగురు అమ్మాయిలతో కలిసి సుధీర్‌ చేసిన డ్యాన్స్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. పెళ్లికి అతిథులుగా విచ్చేసిన హేమ, అన్నపూర్ణ, బుల్లెట్‌ భాస్కర్‌, రామ్‌ప్రసాద్‌ తమదైన శైలిలో నవ్వించారు. ‘దిగుదిగు దిగు నాగ’ పాటకు వర్ష వేసిన స్టెప్పులు, ‘ఆర్కెస్ట్రా’ పేరుతో హైపర్‌ ఆది వేసిన పంచ్‌లు అలరించేలా ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని