Jacqueline: జాక్వెలిన్‌ను ఇంకోసారి కామెంట్‌ చేస్తే అంతే సంగతులు: సుఖేశ్‌ వార్నింగ్‌

నటి జాక్వెలిన్‌ (Jacqueline)పై కామెంట్‌ చేసిన మికాసింగ్‌పై సుఖేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మికాను బెదిరిస్తూ లేఖ రాశాడు.

Updated : 05 Oct 2023 15:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez)ను ఇటీవల ప్రముఖ గాయకుడు మికాసింగ్‌ (Mika Singh) టీజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక నేరాలకు పాల్పడి జైలు కెళ్లిన సుఖేశ్‌ చంద్రశేఖర్‌ (Sukesh Chandrashekhar) ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన ప్రియురాలిపై కామెంట్‌ చేసిన మికాను బెదిరిస్తూ తాజాగా ఓ లేఖ రాశాడు. మళ్లీ ఇది రిపీట్‌ అయితే పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించాడు.

‘‘మికా.. నువ్వు ఏం చేస్తున్నావో నేను చూస్తున్నా. జాక్వెలిన్‌కు ఏం బాగుంటుందో చెప్పే అంతటివాడివా? నువ్వు ఏం కామెంట్‌ చేశావో నాకు తెలుసు. ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడే ముందు నిన్ను నువ్వు చూసుకో. ఎందుకంటే, నా జీవితం ఏంటో అందరికీ తెలుసు. నువ్వు పైకి కనిపించే అంతటి మంచివాడివి కాదు. ముఖ్యంగా, మహిళలను ఇబ్బందిపెట్టేలా ప్రవర్తిస్తుంటావు. కాబట్టి, వేరేవాళ్ల గురించి మాట్లాడి నీ గౌరవాన్ని దెబ్బతీసుకోకు. ఇంకెప్పుడూ ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వకు. ఒకవేళ ఇదే కనుక రిపీట్‌ అయితే పర్యవసానాలు మరోలా ఉంటాయి. నీ విషయాలు అన్నీ బయటపెడతా. నువ్వు దివాలా తీసే పరిస్థితి వస్తుంది’’ అని హెచ్చరిస్తూ సుఖేశ్‌ లేఖ రాశారు. ప్రస్తుతం ఇది మీడియాలో వైరల్‌గా మారింది.

Brahmaji: లోకేశ్‌ కనగరాజ్‌ మేనేజర్‌నంటూ మోసం.. బ్రహ్మాజీ ట్వీట్‌

ఇటీవల జాక్వెలిన్‌.. నటుడు జీన్-క్లాడ్ వాన్ డామ్‌ను కలిసింది. ఆయనతో దిగిన ఓ ఫొటోని ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది. దీనిపై మికా సింగ్‌ స్పందిస్తూ.. ‘‘నువ్వు అందంగా ఉన్నావు. సుఖేశ్‌తో పోలిస్తే ఇతను ఇంకా బాగున్నాడు’’ అని కామెంట్‌ చేశాడు.

సుఖేశ్‌ 2020 జూన్‌ నుంచి మే 2021 వరకు మొబైల్‌ ఫోన్లు, వాయిస్‌ మాడ్యూలర్లు వినియోగిస్తూ... ఓ కేసులో జైలు పాలైన ర్యాన్‌బ్యాక్సి మాజీ యజమాని శివీందర్‌ సింగ్‌ భార్య అధితి సింగ్‌కు ఫోన్లు చేశాడు. లా సెక్రటరీ అనూప్‌కుమార్‌గా పరిచయం చేసుకొన్నాడు. ఆమె భర్తకు బెయిల్‌ ఇప్పిస్తానని రూ.200 కోట్లకుపైగా వసూలు చేశాడు. ఈ డబ్బు చెల్లించేందుకు ఆ కుటుంబం అప్పులు కూడా చేసింది. ఎన్నాళ్లకు బెయిల్‌ రాకపోవడంతో అధితికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటపడింది. ఈ కేసులో అరెస్టైన సుఖేశ్‌ ప్రస్తుతం మండోలీ జైలులో ఉన్నాడు. జాక్వెలిన్‌ను తన ప్రేయసి అని ఆయన చెబుతుంటాడు. వీరిద్దరి మధ్య లావాదేవీలు కూడా జరిగాయి. దీంతో జాక్వెలిన్‌ సైతం గతంలో విచారణ ఎదుర్కొంది.

మరోవైపు, సుఖేశ్‌ చంద్రశేఖర్‌ తన జీవితాన్ని నరకప్రాయం చేశాడని జాక్వెలిన్‌ గతంలో వాపోయింది. అతడు తన జీవితంతో ఆడుకొని కెరీర్‌ను జీవనోపాధిని నాశనం చేశాడని న్యాయస్థానం ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. హోంశాఖలో ఓ ముఖ్య అధికారిగా సుఖేశ్‌ తనను తాను జాక్వెలిన్‌కు పరిచయం చేసుకొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని