
Published : 24 Jan 2022 14:44 IST
Malli Modalaindi: ఓటీటీలో ‘మళ్లీ మొదలైంది’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
హైదరాబాద్: సుమంత్(Sumanth) హీరోగా టీజీ కీర్తి కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘మళ్లీ మొదలైంది’(Malli Modalaindi). రాజశేఖర్ రెడ్డి నిర్మాత. వర్షిణీ సౌందర్ రాజన్, నైనా గంగూలి కథానాయికలు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ5’లో నేరుగా విడుదల కానుంది. ఇటీవల ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాగా, ఇప్పుడు స్ట్రీమింగ్ తేదీని కూడా వెల్లడించింది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ‘మళ్లీ మొదలైంది’ జీ5లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. ‘‘విడాకులు తీసుకున్న ఓ యువకుడు.. తన న్యాయవాదితో ప్రేమలో పడితే ఏం జరిగింది? అన్నదే ఈ చిత్ర కథాంశం. ఇందులో సుమంత్ భార్యగా వర్షిణీ కనిపించనుండగా.. న్యాయవాది పాత్రను నైనా గంగూలి పోషించింది. సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: శివ.
Tags :