‘ఎంగేజ్‌మెంట్ అని చెప్పొచ్చు కదమ్మా’ అన్నారు!
తన మధురమైన స్వరంతో గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎంతోమంది సినీ ప్రియుల హృదయాల్లో సుస్తిర స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రముఖ గాయని సునీత. వ్యక్తిగత జీవితంలో పలు సమస్యలను ఎదుర్కొన్న సునీత ఇటీవల రామ్ వీరపనేనితో...
గాయని సునీత
హైదరాబాద్: తన మధురమైన స్వరంతో గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎంతోమంది హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు సునీత. ఆమె ఇటీవల రామ్ వీరపనేనితో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వాలంటైన్స్‌డే సందర్భంగా ఈ జంట ఓ స్పెషల్ చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. తమ వైవాహిక బంధం, కుటుంబం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ సందర్భంగా పంచుకున్నారు.
‘‘ఎప్పటి నుంచో రామ్ నాకు తెలుసు. తను ఎప్పుడైనా ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేసేదాన్ని కాదు. వృత్తిపరమైన పనుల విషయమై లాక్‌డౌన్‌లో రామ్ ఓసారి నాకు ఫోన్ చేశారు. ‘ఇంకేంటి.. ఇలాగే ఉండిపోతావా? లేక పెళ్లి గురించి ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా?’ అని రామ్‌ని అడిగాను. దానికి ఆయన ‘నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దాదాపు ఏడేళ్ల నుంచి పరోక్షంగా నీకు ఈ విషయాన్ని చెబుతున్నాను’ అని సమాధానమిచ్చారు. అనంతరం, అమ్మానాన్న, నా పిల్లల్తో మాట్లాడాను. వాళ్లందరూ ఎంతో సంతోషించారు. అదే సమయంలో రామ్.. నా గురించి వాళ్లింట్లో చెప్పడం.. అక్కడ కూడా ఓకే అనడం జరిగింది’’
‘‘ఇరు కుటుంబాల్లోనూ మా వివాహాన్ని ఓకే అనుకున్నాక.. రామ్ వాళ్ల కుటుంబసభ్యులు మా అమ్మవాళ్లతో మాట్లాడడానికి మొదటిసారి మా ఇంటికి వచ్చారు. అదేసమయంలో నాకు తాంబూలం అందించారు. ఆ ఫొటోలే బయటకు వచ్చాయి. నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఆ విషయం మా ఇద్దరికీ తెలీదు. అది జరిగిన తర్వాత రోజు నాకు తెలిసిన వాళ్లు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. మాకు నిశ్చితార్థమైందని నెట్టింట్లో పోస్టులు దర్శనమిచ్చాయి. ఓసారి పనిపై బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి నా పిల్లలు నాపై కోపంగా ఉన్నారు. ‘నిన్న నీకు ఎంగేజ్‌మెంట్ అని మాకు ముందే చెప్పొచ్చు కదా. మేము మంచి బట్టలు వేసుకునేవాళ్లం. లైఫ్‌లో ఎంతో ముఖ్యమైన ఈ విషయాన్ని మాకు చెప్పవా?’ అని ప్రశ్నించారు. ‘ఇది ప్లాన్ చేయలేదురా. వాళ్లు వచ్చారు.. అనుకోకుండా నాకు బట్టలు పెట్టారు’ అని సమాధానమిచ్చాను. నా పిల్లలు పరిస్థితి అర్థం చేసుకున్నారు. వాళ్లు నాకెంతో సపోర్ట్ చేశారు’’ అని సునీత వివరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Bimal Hasmukh Patel: కొత్త పార్లమెంట్‌ను చెక్కిన శిల్పి.. ఎవరీ బిమల్ పటేల్
-
Movies News
Siddharth: రియల్ లైఫ్‌లో లవ్ ఫెయిల్యూర్.. సిద్దార్థ్ ఏం చెప్పారంటే
-
Crime News
Warangal: లింగనిర్ధరణ చేసి గర్భస్రావాలు.. 18 మంది అరెస్టు
-
Sports News
Ambati Rayudu: ఈ గుంటూరు కుర్రాడికి ఘాటెక్కువే.. ఆటకు అంబటి రాయుడు గుడ్‌బై
-
Crime News
Crime News: దిల్లీలో దారుణం.. నడిరోడ్డుపై 16 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి హత్య..!
-
Crime News
Nizamabad: ఇందల్వాయి టోల్ గేట్ వద్ద కాల్పుల కలకలం