Kantara: ఆ విషయాన్ని మీకంటే ఎవరూ బాగా చెప్పలేరు.. ‘కాంతార’ టీమ్‌పై రజనీకాంత్‌ ప్రశంసలు

‘కాంతార’ చిత్రాన్ని మాస్టర్‌పీస్‌ అని కొనియాడారు ప్రముఖ నటుడు రజనీకాంత్‌. సామాజిక మాధ్యమాల వేదికగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Published : 26 Oct 2022 15:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సగటు ప్రేక్షకులనే కాదు సెలబ్రిటీలనూ మంత్ర ముగ్దుల్ని చేస్తోన్న చిత్రం ‘కాంతార’ (Kantara). ఈ కన్నడ సినిమాకి దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ దక్కుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాని కీర్తించగా తాజాగా రజనీకాంత్‌ (Rajini Kanth) చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ‘‘తెలిసినదానికంటే తెలియంది ఎక్కువ’.. ఈ విషయాన్ని సినిమాల్లో మీకంటే బాగా ఎవరూ చెప్పలేరు’’ అని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ని కొనియాడారు. ‘కాంతార’ సినిమా రోమాలు నిక్కబొడుచుకునేలా చేసిందని, భారతీయ చలన చిత్రపరిశ్రమలో అదొక మాస్టర్‌ పీస్‌ అని అభివర్ణించారు. రచయిత, దర్శకుడు, నటుడిగా రిషబ్‌శెట్టి ప్రతిభకు హ్యాట్సాఫ్‌ అని అన్నారు. ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు తెలిపారు.

కర్ణాటక, కేరళలో విస్తరించిన తుళునాడు ఆచారాలను ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు రిషబ్‌శెట్టి. ముందుగా కన్నడలో విడుదలై ఘన విజయం అందుకున్న ఈ సినిమాని ఇతర భాషల్లోనూ డబ్‌ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులనూ ఈ సినిమా కట్టిపడేసింది. రూ. 16 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం ఇప్పటి వరకూ సుమారు రూ. 200 కోట్లు వసూళ్లు సాధించిందని సినీ వర్గాల సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని