Vikram: కమల్‌హాసన్‌తో సూర్య.. అంతా అనుకున్నట్టు ఆ ప్రాజెక్టులోనేనా?

కమల్‌హాసన్‌, సూర్య కలిసి నటించడమనేది సినీ అభిమానుల కోరిక. ఈ ఇద్దరు అగ్ర హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడాలనుకున్న వారి కల త్వరలోనే నెరవేరబోతుంది.

Published : 13 May 2022 00:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కమల్‌హాసన్‌, సూర్య కలిసి నటించడమనేది చాలామంది సినీ అభిమానుల కోరిక. ఈ ఇద్దరు అగ్ర హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడాలనుకున్న వారి కల త్వరలోనే నెరవేరబోతుందని తెలుస్తోంది. పూర్తిస్థాయి పాత్రలో కాదుగానీ కమల్‌ చిత్రంలో సూర్య కాసేపు సందడి చేయబోతున్నాడని కోలీవుడ్‌ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. సూర్య ఇటీవల చిత్రీకరణలో పాల్గొనగా దానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వాటిల్లో సూర్యతోపాటు కమల్‌ కనిపిస్తాడు. దాంతో ఈ ఇద్దరు కలిసి నటించారంటూ అందరూ ఫిక్స్‌ అవుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన లేదు. ఇంతకీ ఆ క్రేజీ ప్రాజెక్టు మరెదో కాదు కమల్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్‌, థ్రిల్లర్‌ ‘విక్రమ్‌’. ఇందులో ఇప్పటికే.. మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌, విజయ్‌ సేతుపతి తదితరులు కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై కమల్‌హాసన్‌, ఆర్‌. మహేంద్రన్‌ సంయుక్తంగా నిర్మించారు. అనిరుధ్‌ స్వరాలందించాడు. ఇటీవల విడుదలైన తొలి పాటకు శ్రోతల నుంచి విశేష స్పందన లభించింది. జూన్‌ 3న సినిమా విడుదలవుతున్న సందర్భంగా మే 15న ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకురానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని