3 Roses: నాకెప్పుడు పెళ్లి అవుతుందో ఏంటో: పూర్ణ

‘నేను పుష్పవతి అయినప్పటికీ ఇది ఇంకా స్కూల్‌లో కూడా జాయిన్‌ అయి ఉండదు. అలాంటిది ఇప్పుడు దానికి కూడా పెళ్లి అయిపోతుంది....

Updated : 06 Sep 2022 15:44 IST

ఆకట్టుకునేలా 3 రోజెస్‌ ట్రైలర్‌

హైదరాబాద్‌: ‘నేను పుష్పవతి అయినప్పుడు ఇది ఇంకా స్కూల్‌లో కూడా జాయిన్‌ అయి ఉండదు. అలాంటిది ఇప్పుడు దానికి కూడా పెళ్లి అయిపోతుంది. నాకు ఎప్పుడు అవుతుందో ఏంటో’’ అని అసహనం వ్యక్తం చేస్తున్నారు నటి పూర్ణ. ఆమె, పాయల్‌ రాజ్‌పుత్‌, ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘3 రోజెస్‌’. మగ్గీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా నవంబర్‌ 12 నుంచి ఈ సిరీస్‌ అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘3 రోజెస్‌’ ట్రైలర్‌ను నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ట్విటర్‌ వేదికగా విడుదల చేసింది.

30 సంవత్సరాలు వయసు వచ్చినా పెళ్లి కానీ అమ్మాయి పాత్రలో పూర్ణ.. అందమైన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకునే యువతిగా ఈషా.. ట్రెక్కింగ్‌పై ఆసక్తి కనబరిచే అమ్మాయిగా పాయల్‌ కనిపించారు. మూడు విభిన్నమైన మనస్తత్వాలు.. కుటుంబ నేపథ్యాలు.. కలిగిన ఈ ముగ్గురు అమ్మాయిలు కామన్‌గా కోరుకునేది మాత్రం స్వేచ్ఛ. మరి స్వేచ్ఛ కోసం పాకులాడే ఈ అమ్మాయిల కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది..? అనేది తెలియాలంటే ‘3 రోజెస్‌’ చూడాల్సిందే..!

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని