Rowdy Boys: అనుపమని చూస్తుంటే ‘మేరీ’నే గుర్తొస్తుంటుంది: విజయ్‌ దేవరకొండ

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు కుటుంబం నుంచి హీరోగా పరిచయం అవుతున్నాడు ఆశిష్‌. ఆయన నటించిన చిత్రం ‘రౌడీ బాయ్స్‌’. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక.

Updated : 07 Dec 2022 16:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు కుటుంబం నుంచి హీరోగా పరిచయం అవుతున్నాడు ఆశిష్‌. ఆయన నటించిన చిత్రం ‘రౌడీ బాయ్స్‌’. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. ‘హుషారు’ ఫేం హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మాతలు. ఈ చిత్రం నవంబరు 19న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు విజయ్‌ దేవరకొండ ‘ప్రేమే ఆకాశం’ అనే గీతాన్ని విడుదలచేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ఈ చిత్ర దర్శకుడు హర్ష, నాయకానాయికలు ఆశిష్‌, అనుపమతో నాకు పరిచయం ఉంది. ఈ సినిమా ప్రచారంలో నేనూ ఓ భాగమవడం సంతోషంగా ఉంది. చిత్ర పరిశ్రమకి రాకముందు నుంచే నాకు హర్ష తెలుసు. మంచి సినిమా కథలు చెప్తుండేవాడు. అలా ఎన్నో కథలు విన్నాను. ఇప్పటికీ తను కాలేజీ కుర్రాడిలానే ఆలోచిస్తాడు. తెరపై కాలేజీ ఫీలింగ్స్‌, ఎమోషన్స్‌ని బాగా పండిస్తాడు. ఈ చిత్రం ‘హుషారు’ని మించిన విజయం అందుకోవాలని కోరుకుంటున్నా. అనుపమని చూస్తుంటే ‘ప్రేమమ్‌’లోని మేరీ పాత్రే నాకు గుర్తొస్తుంటుంది. సహజమైన నటన ఆమెది. ‘ప్రేమే ఆకాశం’లోనూ అలానే కనిపించింది. ఈ సినిమా ప్రారంభానికి ముందు ఓ సారి ఆశిష్‌ నన్ను కలిశాడు. సినిమా అంటే తనకి ఎంత ప్యాషన్‌ ఉందో నాకు అప్పుడే అర్థమైంది’ అని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని