
Akhanda: ‘అఖండ’ ఓటీటీలో రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతికి లేనట్టే!
హైదరాబాద్: బాలకృష్ణ(balakrishna) కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘అఖండ’(Akhanda). ప్రగ్యా జైశ్వాల్ కథానాయిక. డిసెంబరులో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, బాలకృష్ణ కెరీర్లో రూ.100 కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా రికార్డులు సృష్టించింది. కాగా, ‘అఖండ’ ఎప్పుడు ఓటీటీలో విడుదలవుతుందా? అని అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్ స్టార్ తేదీని ప్రకటించింది. జనవరి 21వ తేదీ నుంచి ‘అఖండ’ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. సంక్రాంతి కానుకగా జనవరి 14, లేదా 15వ తేదీన అందుబాటులోకి వస్తుందని అందరూ ఆశించారు. కానీ, ఓటీటీలో బాలయ్యబాబు నట విశ్వరూపం చూడాలంటే జనవరి 21వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.