Bigg Boss Telugu 5: అలా ‘గుంటనక్క’గా పేరొచ్చింది.. ఆ ముగ్గురిలో ఒకరికి టైటిల్:రవి
యాంకర్ రవి ఇంటర్వ్యూ. ‘బిగ్‌బాస్’ గురించి రవి పంచుకున్న సంగతులివీ...
ఇంటర్నెట్ డెస్క్: ‘యాంకర్ రవిగా కాదు జస్ట్ రవిగానే ‘బిగ్‌బాస్’ ఎంట్రీ ఇచ్చా. ఈ షో వల్ల చాలామంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యా’ అని రవి అన్నారు. అనూహ్య రీతిలో ‘బిగ్‌బాస్’ నుంచి ఎలిమినేట్ అయిన ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘బిగ్‌బాస్’ ఇంటి సభ్యుల గురించి తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఆ ఆసక్తికర సంగతులివీ..
అప్పుడు ఫిక్స్ అయ్యా!
‘‘యాంకర్ రవిని ప్రేక్షకులు చూశారు. జస్ట్ రవిగానే పరిచయమవుదామనుకుంటున్నా’ అని షోలో అడుగుపెట్టక ముందే నాగార్జున సర్‌తో చెప్పా. నాకే ఎక్కువ ఓట్లు వస్తాయని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా ఆటపై నాకు నమ్మకం ఉండేది. ఆ నమ్మకంతోనే టాప్ 5లో ఉంటాననుకున్నా. కానీ, అనుకోకుండా బయటికు వచ్చా. ‘బిగ్‌బాస్ హౌజ్ నుంచి నువ్వు ఎందుకు వెళ్తావ్. నువ్వు చాలా స్ట్రాంగ్. నేను వెళ్లిపోతానేమో’ అని కాజల్ నాతో చెప్పింది. సరే ఏం జరుగుతుందో చూద్దామన్నా. ఫ్రీ ఎవిక్షన్ పాస్ విషయం గుర్తొచ్చాక ఫిక్స్ అయిపోయా. ‘అయిపోయిందిరా మన జర్నీ.. గుండెను రాయి చేసుకో’ అని మనసులో నాతో నేనే అనుకున్నా’’
అందుకు ఫీల్ అవ్వలేదు
‘‘బిగ్‌బాస్ షో కన్నా ముందే నటరాజ్ మాస్టర్‌తో నాకు పరిచయం ఉంది. ఎన్నో ఈవెంట్స్, డ్యాన్స్ షోలు కలిసి చేశాం. అక్కడ చూసిన నటరాజ్ మాస్టర్ వేరు, బిగ్‌బాస్‌లో చూసిన నటరాజ్ మాస్టర్ వేరు. నేను ఆయన గేమ్‌ని చెడగొడతాననే ఉద్దేశంతో నాతో మాట్లాడేవారాయన. తనని నేను నామినేట్ చేసినప్పుడు ఈ విషయం చెప్పా. నేను ఎవరితోనైనా మాట్లాడుతూ తన వైపు చూస్తే చాలు ఆయన గురించే చెబుతున్నాననుకునేవారు. మేం వేరే విషయాల గురించి మాట్లాడుకుంటుంటే ఆయన తన గురించి అనుకునేవారు. అలా ‘గుంటనక్క’ అని నాకు పేరు పెట్టారు. దాన్ని నేను అంగీకరించలేదు. అందుకే నా ఎలాంటి ఫీలింగ్ లేదు. సన్నీ ఓసారి నన్ను ఫేక్ అన్నాడు. దానికీ నేను ఫీల్ అవలేదు. నేను సరదాగా చెప్పిన మాటలకు ఒకానొక సమయంలో షణ్ముఖ్ ప్రభావితమయ్యాడు. అంతేకానీ నేను కావాలని ఎవరినీ ఇన్ఫ్లూయెన్స్ చేయలేదు’’
అదేంటో నాకు తెలియదు
‘‘నాకు సేఫ్‌గేమ్ అంటే ఏంటో కూడా తెలియదు. నా ఆట నేను ఆడేవాడ్ని. నామినేట్ విషయంలోనూ నేను బాధ పడలేదు. ఒకర్ని నామినేట్ చేసేందుకు సరైన కారణం ఉన్నా స్నేహం వల్ల వారిని చేయలేక మరొకరిని చేయాల్సి వస్తుంది. అలా నేను మైండ్ ఎక్కువవాడతానని పింకీ నన్ను నామినేట్ చేసింది. తను చెప్పిన విధానం నాకు నచ్చింది. నేను స్ట్రాంగ్ అయినప్పుడు ఎందుకు ఫీలవుతా’’
ఈ ముగ్గురి గురించి..
‘‘బిగ్‌బాస్’ హౌజ్‌లో నా కన్నా అనర్హుడు మానస్ అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన ధైర్యంగా ఆడటం లేదు. నాకు ఇష్టమైన వ్యక్తి లోబో. కాజల్ ఇంట్లో ఉంటే అనవసరమైన గొడవలు జరుగుతుంటాయి. కాజల్ నేనూ స్నేహితులం. ఆ చనువుతోనే ఓ సందర్భంలో ఆమె నా చొక్కా కాలర్లాగి నన్ను కొట్టింది. నన్ను ఎవరైనా కొడితే తట్టుకోలేను. విపరీతమైన కోపం వస్తుంది. అదే ఆమెపై చూపించా’’
ఒక్క మాటలో..
నా కన్నా వీక్ ప్లేయర్స్: పింకీ, మానస్.
ఒకవేళ నేను టాప్ 5లో ఉంటే: సిరి, శ్రీరామచంద్ర, షణ్ముఖ్, సన్నీ, నేను. ఇప్పుడు నా స్థానంలో కాజల్.
జెస్సీ: చాలా స్ట్రాంగ్. తనో ఫైటర్. తన ఆరోగ్యం బాగుండుంటే కచ్చితంగా టాప్ 5లో ఉండేవాడు.
నటరాజ్ మాస్టర్: ఆయన మనసులో ఏదో పెట్టుకుని హౌజ్‌లోకి వచ్చారు. ఏదైనా అనుకుంటే అది అయిపోవాల్సిందే.
ఉమ: బాగా నవ్వించారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు.
కాజల్: వెరీ స్వీట్.
షణ్ముఖ్: నా డార్లింగ్. నేను ఒకటి చెబితే తను మరోలా అర్థం చేసుకుంటాడు. సిరి, షణ్ముఖ్ మధ్య స్వచ్ఛమైన స్నేహం ఉంది. షణ్ముఖ్ టాప్ 5లో నిలుస్తాడు. ఫైనలిస్టు అవుతాడు.
సరయు: అన్నయ్య అంటుంది. తను టీ బాగా పెడుతుంది. తన గేమ్ ఎలా ఉంటుందో చూడకముందే వెళ్లిపోయింది.
ప్రియ: తనని అక్క అని పిలుస్తా. అందరితోనూ చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది.
సన్నీ: ఏది అనిపిస్తే అది అనేస్తాడు. చాలా స్మార్ట్. ఎంటర్టైన్ చేస్తాడు.
సిరి: తన బలమేంటో తనకి తెలియదు. చిన్న విషయాలకు ఎమోషన్ అయిపోతుంది.
అమ్ము(లహరి): ఎందుకి వెళ్లిపోయిందో ఇప్పటికీ అర్థంకాదు.
పింకీ: హౌజ్‌మేట్స్ అంతా తనని ఇష్టపడతారు. మంచి వ్యక్తి.
మానస్: చాలా సైలెంట్. నెమ్మదస్తుడు తనేం చేస్తాడో ఎవరికీ తెలియదు. అయితే, మానస్‌కు ధైర్యం తక్కువ.
విశ్వ: ఎక్కువగా ఎమోషనల్ అవుతాడు.
లోబో: మంచి స్నేహితుడు.
యానీ మాస్టర్: స్వీట్, స్ట్రాంగ్, ఎమోషనల్. ఏదైనా విషయం గురించి ఎంత వరకు స్పందించాలో ఆమెకు తెలియదు.
హమీదా: ఆమెను చూడగానే మరో అరియానా అవుతుందనిపించింది. ఆమె మాట్లాడితే ఎదుటివారు సైలెంట్ అవ్వాల్సిందే.
శ్రీరామచంద్ర: ఛాంపియన్. ఎప్పుడు దేనికి ఎలా స్పందించాలో తనకి బాగా తెలుసు.
‘బిగ్‌బాస్’ వల్ల చాలామంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాను. విజేతగా నిలవలేకపోయాను. ఎలిమినేట్ అవడానికి కారణాలేంటో చెక్ చేసుకుంటా. ఎప్పటిలానే ప్రేక్షకుల్ని అలరిస్తా. సన్నీ, శ్రీరామచంద్ర, షణ్ముఖ్.. ఈ ముగ్గురిలో ఎవరు గెలిచినా నేను సర్ప్రైజ్ అవ్వను. ఎందుకంటే ఈ ముగ్గరిలో ఒకరు విజేతగా నిలుస్తారనే నమ్మకం ఉంది.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం
రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. -
‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్.. ఈసారి హైఓల్టేజ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో..
Sundeep Kishan: సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించిన ‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్‌గా ‘మాయ-వన్’ రాబోతోంది -
నిన్ను అవమానించిన వాళ్లకు ఇలా సమాధానం చెప్పు: పూరి జగన్నాథ్
మీకు అవమానం జరిగిన సమయంలో పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా సరే, మౌనంగా ఉండండి. ఎందుకంటే అవతలి మనిషి కావాలనే నిన్ను అవమానిస్తున్నాడని అర్థం చేసుకోండని అంటున్నారు పూరి జగన్నాథ్. -
నా ప్రేమ, మద్దతు పవన్‌కల్యాణ్‌కే.. అల్లు అర్జున్ పోస్ట్
పవన్ రాజకీయ ప్రయాణం అద్భుతంగా సాగాలని ఆకాంక్షిస్తూ అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా పోస్ట్‌పెట్టారు. -
‘కన్నప్ప’లో ప్రభాస్.. అప్డేట్ ఇచ్చిన మంచు విష్ణు
‘కన్నప్ప’ సినిమా క్రేజీ అప్డేట్ ఇచ్చారు హీరో మంచు విష్ణు. అదేంటంటే? -
కమల్ హాసన్ సినిమాలో బాలీవుడ్ హీరో.. గౌరవంగా ఉందంటూ పోస్ట్
కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’లో బాలీవుడ్ హీరో అలీ ఫజల్ కీలకపాత్రలో నటిస్తున్నారు. -
Sai Pallavi: హ్యాపీ బర్త్‌డే సాయి పల్లవి.. ‘తండేల్’ టీమ్ స్పెషల్ విషెస్
ప్రముఖ సినీ నటి సాయి పల్లవి తన సహజమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. గురువారం సాయి పల్లవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు ‘తండేల్’ చిత్ర బృందం బర్త్‌డే విషెస్ తెలిపింది.
-
రివ్యూ: ఆవేశం.. రూ.150 కోట్లు వసూలు చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ ఎలా ఉంది?
ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించిన మలయాళ సూపర్‌హిట్ మూవీ ‘ఆవేశం’ మెప్పించిందా? -
విజయ్ దేవరకొండ బర్త్‌డే స్పెషల్.. మూడు సినిమాల అప్డేట్స్ ఇవే..
విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. -
గుడ్‌న్యూస్ చెప్పిన రష్మిక.. మరో భారీ ప్రాజెక్ట్‌తో రెడీ
నటి రష్మిక తన అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో అవకాశమం వచ్చినట్లు తెలిపారు. -
‘ఆరంభం’ టీమ్ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంది: వెంకటేష్ మహా
‘ఆరంభం’ సినిమా మే10న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిరు టు మహేశ్.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ రోజెంతో ప్రత్యేకం..!
వేర్వేరు సంవత్సరాల్లో మే 9న విడుదలై మంచి విజయాలు అందుకున్న సినిమాలపై ప్రత్యేక కథనం. అవేంటో చూసేయండి.. -
కొత్త కథలతో ప్రయాణం
సరికొత్త కథలతో ప్రయాణం చేయనున్నారు విజయ్ దేవరకొండ. మొదట్నుంచీ ఆయనది అదే పంథానే. అందుకే యువ కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు -
సంద్రంలో జాలరి.. తీరంలో అల్లరి
సహజమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్న కథానాయిక... సాయిపల్లవి. ‘తండేల్’లో బుజ్జితల్లిగా సందడి చేయనుంది. -
వీరిద్దరి జీవితం క్రికెట్ ఒక్కటే
నచ్చిన జట్టు క్రికెట్ ఆటలో విజయం సాధిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేరు కొందరు. ఆ కొందరిలో బాలీవుడ్ తారలు జాన్వీ కపూర్, రాజ్‌కుమార్ రావ్లు కూడా ఉన్నారు. -
ఈటీవీ విన్లో ఒకే రోజు రెండు సినిమాలు
ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో గురువారం రెండు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. ‘చిత్రం చూడర’, ‘పారు’్ధ.. ఈ రెండు సినిమాలు నేడే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి -
విడుదల సెట్ అయ్యిందే...!
కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న ‘భజే వాయు వేగం’ విడుదల ఖరారైంది. ఈ నెల 31న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో తెలిపాయి. -
ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రావడం లేదు?
సినిమాకు కథే హీరో. ఈ కథలే ఎంతో మంది ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేలా చేస్తాయి. కానీ ప్రస్తుతం బాలీవుడ్లో అలాంటి కథా చిత్రాలు రాకపోవడంతో థియేటర్లలో సందడి లేదు. -
తండ్రీతనయులు తాత మనవళ్లుగా...
నిజ జీవితంలో తండ్రీ తనయులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ తెరపై తాత, మనవడుగా సందడి చేయనున్నారు. -
ఇలాంటి కలయికలో మరో చిత్రం రాదేమో!
గత కొంత కాలంగా హిందీ సినిమాలకు దూరంగా ఉన్న అగ్రకథానాయిక ప్రియాంక చోప్రా వరుస హాలీవుడ్ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. -
వించిపేట భద్ర... ఎంతో ప్రత్యేకం
‘‘ఇప్పటివరకూ చేసిన పాత్రలకి పూర్తి భిన్నంగా... గాఢతతో కూడిన వించిపేట భద్ర పాత్ర నా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది’’ అన్నారు సత్యదేవ్.
తాజా వార్తలు (Latest News)
-
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. కొత్త వీడియో వైరల్!
-
‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్.. ఈసారి హైఓల్టేజ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో..
-
ఇంధనం కటకట..! రఫా ఆస్పత్రులపై ‘డబ్ల్యూహెచ్‌వో’ ఆందోళన
-
పారిస్ ఒలింపిక్స్‌లో ఏదైనా జరగొచ్చు: నీరజ్ చోప్రా
-
రన్‌వే పై జారిన బోయింగ్ 737 విమానం.. 10మందికి గాయాలు
-
కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వదిలేస్తాడా? వచ్చే మెగా వేలానికి ముందు భారీ షాక్ తప్పదా?