Radhe Shyam: ప్రభాస్‌ చిత్రంలో కృష్ణంరాజు.. లుక్‌ అదిరింది!

‘బిల్లా’, ‘రెబల్‌’ తర్వాత ప్రముఖ నటులు కృష్ణంరాజు, ప్రభాస్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. కృష్ణంరాజు పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది.

Published : 20 Dec 2021 19:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బిల్లా’, ‘రెబల్‌’ తర్వాత ప్రముఖ నటులు కృష్ణంరాజు, ప్రభాస్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. కృష్ణంరాజు పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ఇందులో ఆయన కాషాయం రంగు వస్త్రాల్లో.. జపం చేస్తూ కనిపించారు. ఈ సినిమాలో ఆయన పరమహంస అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ పోస్టర్‌లో కృష్ణంరాజు కొత్తగా కనిపించటంతో విడుదలైన కొన్ని క్షణాల్లోనే నెట్టింట వైరల్‌గా మారింది. రాధాకృష్ణకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన పూజాహెగ్డే నటిస్తోంది. జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2022 సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. 70ల కాలం నాటి ప్రేమకథతో రూపొందుతున్న చిత్రమిది. ప్రభాస్‌ ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనున్నారు. 

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని