Cinema News: ఆసక్తిగా ‘గూడుపుఠాణి’ ట్రైలర్‌

సప్తగిరి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘గూడుపుఠాణి’. నేహా సోలంకి నాయిక. కె.ఎం. కుమార్‌ దర్శకుడు.

Updated : 07 Dec 2022 17:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు సప్తగిరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘గూడుపుఠాణి’. నేహా సోలంకి కథానాయిక. కె.ఎం. కుమార్‌ దర్శకుడు. ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. నాయకానాయికల ప్రేమ కథతో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. లవ్‌స్టోరీతోపాటు యాక్షన్‌ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. మధ్యలో ఓ హత్యకేసుకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్‌ సీన్లు ఉత్కంఠ పెంచుతున్నాయి. గాయకుడు, సంగీత దర్శకుడు రఘుకుంచె విలన్‌గా కనిపించి, మెప్పించారు. సప్తగిరి, రఘుకుంచెకి మధ్య వైరం ఎందుకు మొదలైంది? గూడుపుఠాణి ఎవరు చేశారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.ఆర్‌. ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీనివాసరెడ్డి, రమేశ్‌ యాదవ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: ప్రదీప్‌ విద్య, ఛాయాగ్రహణం: పవన్‌ చెన్నా, కూర్పు: నాగేశ్వర రెడ్డి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని