Marakkar: విడుదలైన 15 రోజుల్లోనే ఓటీటీలోకి మోహన్‌లాల్‌ ‘మరక్కార్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌(Mohan lal) ప్రధాన పాత్రలో ప్రియదర్శన్‌ తెరకెక్కించిన చిత్రం ‘మరక్కార్‌: అరేబియా సముద్ర సింహం’(Marakkar)

Updated : 13 Dec 2021 22:01 IST

హైదరాబాద్‌: మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌(Mohan lal) ప్రధాన పాత్రలో ప్రియదర్శన్‌ తెరకెక్కించిన చిత్రం ‘మరక్కార్‌: అరేబియా సముద్ర సింహం’(Marakkar). కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబరు 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. డిసెంబరు 17వ తేదీ నుంచి ‘మరక్కార్‌’ స్ట్రీమింగ్‌ అవుతుందని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తెలిపింది. ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. కేవలం 15 రోజుల్లోనే ‘మరక్కార్‌’ ఓటీటీలోకి రావడం గమనార్హం. అర్జున్‌, కీర్తిసురేశ్‌, సునీల్‌శెట్టి, సుహాసిని, కల్యాణి ప్రియదర్శన్‌ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. థియేటర్‌లో విడుదల కాకముందే ‘మరక్కార్‌’ మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకోవటం విశేషం.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని