Naveen Polishetty: అనుష్క- నవీన్‌ పొలిశెట్టి కాంబో.. ఇకపై అధికారికం

ప్రముఖ నటి అనుష్క శెట్టి, యువ నటుడు నవీన్‌ పొలిశెట్టి కలిసి నటిస్తున్నారంటూ టాలీవుడ్‌లో కొన్నాళ్ల క్రితం వినిపించింది.

Published : 26 Dec 2021 21:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటి అనుష్క శెట్టి, యువ నటుడు నవీన్‌ పొలిశెట్టి కలిసి నటిస్తున్నారంటూ టాలీవుడ్‌లో కొన్నాళ్ల క్రితమే వినిపించింది. ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్‌ స్పష్టతనిచ్చింది. ఈ ఇద్దరితో తాము ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ఆదివారం అధికారికంగా ప్రకటించింది. నవీన్‌ పొలిశెట్టి పుట్టినరోజును పురస్కరించుకుని తన పాత్రకు సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో ఆయన మైక్‌ పట్టుకుని స్టైలిష్‌గా కనిపించారు. ‘రారా కృష్ణయ్య’ ఫేం మహేశ్‌బాబు.పి. దర్శకత్వంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ తెరకెక్కుతుంది. టైటిల్‌, ఇతర తారాగణం, సాంకేతిక బృంద వివరాలు మరికొన్ని రోజుల్లో తెలియనున్నాయి.

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని