Samantha: కిక్కిచ్చిన ‘ఊ అంటావా’.. సమంత ఎంత కష్టపడిందో చూశారా..!
‘ఊ అంటావా ఊఊ అంటావా’ మేకింగ్ వీడియో. సమంత ఎంత కష్టపడిందో ఈ వీడియోలో చూసేయండి..
ఇంటర్నెట్ డెస్క్: గమ్మత్తైన స్వరంతో ‘ఊ అంటావా ఊఊ అంటావా’ అంటూ గాయని ఇంద్రవతి చౌహాన్ శ్రోతల్ని మత్తెక్కించింది. ఇదే పాటలో నర్తించి ప్రముఖ నటి సమంత ప్రేక్షకులకు మాంచి కిక్కిచ్చింది. తొలిసారి ప్రత్యేక గీతంలో కనిపించి ఉర్రూతలూగించింది. అదిరిపోయే స్టెప్పులు, రొమాంటిక్ ఎక్స్ప్రెషన్లతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీని వెనక ఎంత కష్టం దాగుందో తాజాగా తెలియజేసింది. ఈ మేరకు ఓ వీడియోను పంచుకుంది. ఇందులో.. డ్యాన్స్ మాస్టర్ చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది సమంత. అనుకున్న ఔట్పుట్ వచ్చేంత వరకూ వదిలిపెట్టరంటూ శిక్షకులను ఉద్దేశించి నవ్వుతూ చెప్పుకొచ్చింది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ చిత్రంలోని గీతమిది. ఈ పాటలో కనిపించిన అల్లు అర్జున్- సమంత జోడీకి మంచి మార్కులే పడ్డాయి. చంద్రబోస్ సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం విశేషంగా అలరించాయి. ఈ పాటకు సంబంధించిన ఎన్నో పేరడీలు నెట్టింట వైరల్ అయ్యాయి. 2021 డిసెంబరులో విడుదలైన ఈ పాన్ ఇండియా చిత్రం అన్ని కేంద్రాల్లోనూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో జనవరి 7 రాత్రి 8 గం.ల నుంచి స్ట్రీమింగ్కానుంది.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్‌బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్‌ను చూడలేదు: మాధవన్
అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్‌ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ అన్నారు. తాజాగా కపిల్‌శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్‌డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్‌తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్‌పై బిగ్‌బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్‌బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్‌గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!