Published : 06/12/2021 21:19 IST

Pushpa: అల్లు అర్జున్‌ అదరగొట్టేశాడు.. ‘పుష్ప’ ట్రైలర్‌ వచ్చేసింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘తగ్గేదే లే’ అనే ఒకే ఒక డైలాగ్‌.. ‘దాక్కో దాక్కో మేక’, ‘శ్రీవల్లి’, ‘సామి’, ‘ఏయ్‌ బిడ్డా’ అనే నాలుగు పాటలు.. ‘పుష్ప’ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. చిత్ర వర్గాలు, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడా జాబితాలోకి ట్రైలర్‌ చేరింది. సోమవారం విడుదలైన ఈ ట్రైలర్‌ చిత్రంపై ఉన్న అంచనాల్ని మరింత పెంచేలా ఉంది. పాత్రలను తీర్చిదిద్దిన తీరు, అడవి నేపథ్యంలో సాగే సన్నివేశాలు విశేషంగా అలరిస్తున్నాయి. నేపథ్య సంగీతం ట్రైలర్‌కు ఆయువుపట్టుగా నిలిచింది. అల్లు అర్జున్‌ అభిమానులు కోరుకునే పక్కా కమర్షియల్‌ హంగులన్నీ ఈ సినిమాలో ఉన్నట్టు కనిపిస్తోంది.

అల్లు అర్జున్‌ హీరోగా పాన్‌ ఇండియా స్థాయిలో సుకుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. రష్మిక కథానాయిక. ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడు. సునీల్‌, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ రెండు భాగాలుగా నిర్మిస్తోంది. ‘ది రైజ్‌’ పేరుతో తొలి భాగం డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత అల్లు అర్జున్‌- సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది.

Read latest Cinema News and Telugu News


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని