Senapathi Review: రివ్యూ: సేనాపతి
Senapathi Review: రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటించిన ‘సేనాపతి’ సినిమా ఎలా ఉందంటే?
చిత్రం: సేనాపతి; నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, నరేశ్ అగస్త్య, హర్షవర్థన్, జ్ఞానేశ్వరి, సత్య ప్రకాశ్, రాకేందు మౌళి తదితరులు; సంగీతం: శ్రవణ్ భరద్వాజ్; ఎడిటింగ్: గౌతమ్ నేరుసు; సినిమాటోగ్రఫీ: వివేక్ కాలేపు; నిర్మాత: సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్; దర్శకత్వం: పవన్ సాదినేని; విడుదల: ఆహా ఓటీటీ
హాస్య కథానాయకుడిగా, నటుడిగా తెలుగు తెరపై చెరగని ముద్రవేశారు రాజేంద్రప్రసాద్. ఇటీవల కాలంలో ఆయన కథాబలమున్న పాత్రలనే ఎంచుకుంటున్నారు. అలా ఆయన కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సేనాపతి’(Senapathi). తమిళంలో ఘన విజయం సాధించిన ‘8 తొట్టకళ్’ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. మరి సేనాపతి కథ ఏంటి? అతను ఏం చేశాడు? పవన్ సాదినేని ఎలా తెరకెక్కించారు?(Senapathi review)
కథేంటంటే: చేయని నేరానికి బాల్యంలో ఎనిమిదేళ్లు జువైనల్ హోమ్‌లో ఉన్న కృష్ణ (నరేష్ అగస్త్య).. కష్టపడి చదివి ఎస్సై అవుతాడు. ఎవరికీ అన్యాయం జరగకూడనేది అతడి ఆశయం. ఐపీఎస్ కావాలనేది అతడి లక్ష్యం. అయితే... ఓ క్రిమినల్‌ను పట్టుకునే క్రమంలో అతడి సర్వీస్ రివాల్వర్ పోతుంది. మరి అది ఎవరికి దొరికింది? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లింది? హైదరాబాద్ సిటీలో ఓ బ్యాంకు దోపిడీకి, వరుస హత్యలకు ఆ గన్ ఎలా సాక్ష్యంగా నిలిచింది? గన్ మళ్లీ తన చేతికి రావడం కోసం కృష్ణ ఎటువంటి ప్రయత్నాలు చేశాడు? బ్యాంకు దోపిడీ చేసిన మూర్తి అలియాస్ కృష్ణమూర్తి (రాజేంద్ర ప్రసాద్) కథ ఏమిటి? కృష్ణ, మూర్తి ఎలా కలుసుకున్నారు? చివరకు, ఏమైంది?
ఎలా ఉందంటే: ఒక భాషలో విజయవంతమైన చిత్రాలు ఇతర భాషల్లో రీమేక్ అవుతుంటాయి. అయితే, ఆ భాష, ప్రాంతానికి దగ్గరగా ఎలాంటి మార్పులతో తెరకెక్కించారన్న దానిపై ఆ సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. లేకపోతే డబ్బింగ్ మూవీ చూశామన్న ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుంది. అలా తమిళంలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ‘8 తూట్టకళ్’ మూవీని ‘సేనాపతి’ పేరుతో తెరకెక్కించడంలో దర్శకుడు పవన్ సాదినేని సఫలమయ్యారు. చేయని నేరానికి కృష్ణ జైలుకు వెళ్లడంతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు త్వరగానే ప్రేక్షకుడు కథకు కనెక్ట్ అయ్యేలా చేశారు. కృష్ణ వ్యక్తిత్వం, తనలా మరొకరు ఇబ్బంది పడకూడదన్న ఆశయం తదితర సన్నివేశాలతో సినిమా అలా సాగిపోతుంటుంది. మరోవైపు పోలీసు వ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతి, నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారన్న విషయాలను దర్శకుడు ప్రస్తావించాడు. కథానాయిక ఉన్నా ఫక్తు కమర్షియల్ డ్రామావైపు వెళ్లకుండా లవ్‌ట్రాక్, పాటల జోలికి పోకుండా కేవలం కథపైనే దృష్టి పెట్టిన విధానం బాగుంది.
ఎప్పుడైతే కృష్ణ సర్వీస్ రివాల్వర్ పోగొట్టుకున్నాడో అప్పుడు అసలు కథ మొదలవుతుంది. దాన్ని కనిపెట్టేందుకు కృష్ణ చేసే ప్రయత్నాలతో చకచకా సన్నివేశాలు సాగిపోతాయి. గన్స్‌ను ఎలా మారుస్తారు? ఒకరి నుంచి మరొకరికి ఎలా మారతాయి? ఎక్కడెక్కడ దొరుకుతాయి? వంటి విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. పైకి సాధారణ వ్యాపారులుగా కనిపించే వ్యక్తులు ఎలా క్రైమ్ వరల్డ్‌ను డీల్ చేస్తారన్నది చూపించారు. అటు తిరిగి, ఇటు తిరిగి ఆ గన్ చివరకు మూర్తి దగ్గరకు వస్తుంది. అదే గన్‌తో బెదిరించి మూర్తి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి బ్యాంకు దోపిడీ చేస్తాడు. ఈ క్రమంలో పొరపాటున గన్ పేలి ఐదేళ్ల పాప చనిపోవడంతో కథ మరింత ఆసక్తిగా మారుతుంది. ఇక్కడి నుంచి కథలో వేగం పెరుగుతుంది. ఒకవైపు తన తుపాకీ కోసం స్పెషల్ ఆఫీసర్(హర్షవర్థన్)తో కలిసి కృష్ణ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడం, మరోవైపు దోచుకున్న డబ్బు పోలీసులకు చిక్కకుండా మూర్తి అండ్ కో ప్రయత్నాలు ఉత్కంఠగా సాగుతాయి. ఈ క్రమంలో మూర్తి తీసుకున్న ఒక్కో నిర్ణయం కృష్ణను మరింత చిక్కుల్లో పడేస్తుంది. అక్కడి నుంచి వచ్చే ఒక్కో ట్విస్ట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. మూర్తి ఎదురుగానే కనిపిస్తున్నా అతడే అసలు సూత్రధారి అని కృష్ణ ఎలా నిరూపించాడు? అసలు మూర్తి వెనుక ఉన్న ఫ్లాష్‌బ్యాక్ ఏంటి? తదితర విషయాలన్నీ ఉత్కంఠగా కనిపిస్తాయి. పతాక సన్నివేశాలు మెప్పిస్తాయి. ఒక మంచి థ్రిల్లర్ చూశామన్న భావన ప్రేక్షకుడిలో కలుగుతుంది. థియేటర్లో విడుదలయ్యేందుకు అన్ని అర్హతలు ఈ సినిమాకు ఉన్నాయి.
ఎవరెలా చేశారంటే: ‘సేనాపతి’ చిత్రంలో కనిపించే పాత్రలు తక్కువే. అయినా ప్రతి పాత్రా కథతో ముడిపడి ఉంటుంది. ఎస్సై కృష్ణగా నరేశ్ అగస్త్య చక్కగా సరిపోయారు. తనదైన నటనతో మెప్పించారు. ఇక ఈ సినిమాకు మూలం మూర్తి అలియాస్ కృష్ణమూర్తి పాత్ర పోషించిన రాజేంద్రప్రసాద్. మూర్తి పాత్రలో రాజేంద్రప్రసాద్‌ను తప్ప మరొకరిని ఊహించలేం. తన అనుభవాన్ని అంతా రంగరించి మూర్తిగా సరికొత్తగా ఆయన కనిపిస్తారు. మూర్తిపాత్ర కోసం ఆయన ఆహార్యం, డిక్షన్ చాలా బాగున్నాయి. మిగిలిన వాళ్లు తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. శ్రవణ్ నేపథ్య సంగీతం ప్రేక్షకుడిని సినిమాలో మరింత ఇన్వాల్వ్ చేసింది. వివేక్ కాలేపు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని సన్నివేశాల్లో డార్క్ థీమ్, లైటింగ్ ఎఫెక్ట్ సహజంగా ఉన్నాయి. గౌతమ్ ఎడిటింగ్ కూడా చక్కగా కుదిరింది. ద్వితీయార్ధంలో ఒకట్రెండు సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ‘8 తూట్టకళ్’ను ‘సేనాపతి’గా మార్చడంలో దర్శకుడు పవన్సాదినేని విజయం సాధించారు. క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడేవాళ్లను ‘సేనాపతి’ విశేషంగా మెప్పిస్తాడు. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడికి చక్కటి వినోదాన్ని పంచుతాడు. కమర్షియల్ అంశాల జోలికి పోకుండా కేవలం కథ, కథనాలను పవన్ నడిపించిన తీరు బాగుంది. ఒక క్రైమ్ థ్రిల్లర్‌ను మాత్రమే కాకుండా అవినీతి, నిర్లక్ష్యంతో పాటు, వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల పిల్లలు వ్యవహరిస్తున్న తీరును ఇందులో చర్చించారు. ముఖ్యంగా కుటుంబ బంధాలపై డబ్బు ప్రభావం ఎలా ఉంటుందన్నది మూర్తి పాత్ర ద్వారా చూపించిన విధానం భావోద్వేగాన్ని కలిగిస్తుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి
బలాలు
+ కథ, దర్శకత్వం
+ రాజేంద్రప్రసాద్, నరేశ్ అగస్త్య
+ సాంకేతిక బృంద పనితీరు
బలహీనతలు
- ద్వితీయార్ధంలో కాస్త నెమ్మదిగా సాగే కథనం
చివరిగా: థ్రిల్లింగ్ ‘సేనాపతి’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జీతూ మాధవన్ దర్శకత్వంలో ఫహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
మమితా బైజు, అర్జున్ అశోకన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథేంటంటే? -
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
baak movie review: ‘అరణ్మనై’ సిరీస్‌లో నాలుగో భాగంగా వచ్చిన ‘బాక్’మూవీ సినీ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
aa okkati adakku review: అల్లరి నరేష్, ఫరియా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ మెప్పించిందా. -
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
sabari movie review in telugu: వరలక్ష్మీ శరత్‌కుమార్, గణేశ్ వెంట్రామన్ కీలక పాత్రల్లో నటించిన ‘శబరి’ మెప్పించిందా? -
రివ్యూ: ప్రసన్నవదనం.. సుహాస్ ఖాతాలో హిట్ పడిందా?
సుహాస్ కీలక పాత్రలో ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్‌తో రూపొందిన థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది. -
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్‌లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
భారీ తారాగణంతో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌సిరీస్ మెప్పించిందా? -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: ప్రాజెక్ట్-Z.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్-Z’ ప్రేక్షకులను మెప్పించిందా?
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్‌కు భారీ షాకిచ్చిన అమెరికా.. కీలక ఆయుధ సరఫరా నిలిపివేత
-
గిరాకీ తగ్గింది.. టీకాను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్నాం: ఆస్ట్రాజెనెకా
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,276
-
ఏపీ సీఎస్ ఉదాసీనతతో పండుటాకులకు పాట్లు
-
దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి