RGV: రామ్‌గోపాల్ వర్మ X పేర్నినాని.. ట్విటర్వార్
ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ ధరల తగ్గింపు వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మధ్య ట్వీట్ వార్ జరుగుతోంది. సినిమా టికెట్ ధరల విషయంలో గడిచిన రెండు...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల (Movie Ticket rates) తగ్గింపు వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma), ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని (Perni Nani) మధ్య ట్విటర్ వార్ జరుగుతోంది. సినిమా టికెట్ ధరల విషయంలో ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ.. రెండ్రోజుల నుంచి వర్మ వ్యాఖ్యలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో వర్మ అడిగిన ప్రశ్నలకు బుధవారం ఉదయం మంత్రి నాని సమాధానమిచ్చారు. ‘రూ.100 టికెట్‌ను రూ.1000, రూ.2000కు అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్, సప్లయ్ అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా?’ అంటూ నాని ప్రశ్నల వర్షం కురిపించారు.
కాగా, తాజాగా మంత్రి వ్యాఖ్యలపై రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. ‘‘రాజకీయ నాయకుడిగా కాకుండా గౌరవప్రదంగా సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు నానీ గారూ. రూ.100 టికెట్‌ని వెయ్యికి అమ్ముకోవచ్చా అనేది అసలు ప్రశ్నే కాదండి. ఎందుకంటే అది అమ్మేవాడి నమ్మకం.. కొనేవాడి అవసరంపై ఆధారపడి ఉంటుంది. ముడి పదార్థం రూ.500 కూడా ఖర్చవ్వని పెయింటింగ్‌ని కొనేవాడుంటే రూ.5 కోట్లకి అమ్ముతారు. ముడి పదార్థానికే విలువ ఇస్తే దాని బ్రాండ్‌కి ఎలా వెల కడతారు? క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఉన్నదానికంటే బెటర్‌గా ఉండేలా ప్రయత్నించాలి. ఇక అది బెటరా? కాదా? అనేది కొనుగోలుదారుడే నిర్ణయిస్తాడు. కొనేవాడికి, అమ్మేవాడికి మధ్య లావాదేవీలు ఎంత జరిగాయనే పారదర్శకత మాత్రమే ప్రభుత్వానికి అవసరం. ఎందుకంటే వాళ్లకు పన్ను రావాలి. బ్లాక్ మార్కెటింగ్ అనేది ప్రభుత్వానికి తెలియకుండా చేసే క్రైమ్. ఓపెన్‌గా ఎంతకి అమ్ముతున్నారో చెప్పి అమ్మితే అది తప్పేలా అవుతుంది?’’ అని ఆర్జీవీ ప్రశ్నించారు.
సామాన్యుడి అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి ఉండకూడదనే ప్రభుత్వం సినిమా టికెట్ ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుందని నానీ చెప్పిన సమాధానంపై ఆర్జీవీ స్పందిస్తూ.. ‘‘క్షమించండి నాని గారూ.. దీన్ని లూటీ అనరు. ఎందుకంటే.. అమ్మేవాడు, కొనేవాడు పరస్పరం అంగీకరించుకుని చేసుకునే దాన్ని లావాదేవీలు అంటారు. అవి చట్టపరంగా జరిగినప్పుడు ప్రభుత్వ వాటా పన్ను రూపంలో వస్తుంది. థియేటర్లనేవి ప్రజాకోణంలో వినోద సేవలందించే ప్రాంగణాలు అని చెప్పారు. అలా అని ఏ ప్రజలు చెప్పారో వాళ్ల పేర్లు చెప్పగలరా? లేకపోతే రాజ్యాంగంలో గానీ సినిమాటోగ్రఫీ యాక్ట్‌లో గానీ ఈ డెఫినిషన్ ఉందా? మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని సమర్థించుకోవటానికే ఆ డెఫినిషన్ను మీకు మీరు ఇచ్చుకుంటున్నారు’’ అని అన్నారు.
‘‘జూన్ 19, 1905న మొట్టమొదటి థియేటర్ అమెరికాలో పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకూ అవి కేవలం బిజినెస్ కోసం పెట్టిన సంస్థలు. అంతేకానీ, ప్రజాసేవ నిమిత్తం ఎప్పుడూ ఎవ్వరూ పెట్టలేదు. కావాలంటే మీ ప్రభుత్వంలో ఉన్న థియేటర్ యజమానుల్ని అడగండి’’
‘‘ధరలు తగ్గిస్తున్నది పేదవాడికి అందుబాటులో ఉండాలని, సినిమాని నిత్యావసర వస్తువుగా పరిగణిస్తున్నామని చెప్పింది మీ నాయకులే. అది కానప్పుడు అసలు ఈ చర్చ ఎందుకు? పేదల కోసం చెయ్యడం అనే మీ ఉద్దేశం మంచిది కావచ్చు. కానీ దానికోసం పేదల్ని ధనికుల్ని చెయ్యటానికి మీ ప్రభుత్వం పని చేయాలి. కానీ.. ఉన్న ధనికుల్ని పేదల్ని చెయ్యకూడదు.. అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోకెల్లా పేద రాష్ట్రంగా అయ్యే ప్రమాదముంది’’
‘‘చివరిగా.. నేను సాధారణ ఇంజినీరింగ్ స్టూడెంట్‌ని, ఆర్థికశాస్త్రం గురించి నాకు ఏమీ తెలియదు. కానీ, అనుమతిస్తే మీ ప్రభుత్వంలో టాప్ ఎకనామిక్స్ అనుభవజ్ఞుడితో చర్చకు సిద్ధం. మా సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య ఏర్పడ్డ సమస్యలను తొలగించడానికి చర్చ అవసరం’’అని రామ్‌గోపాల్ వర్మ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్‌ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్‌గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి.