Oke Oka Jeevitham: శర్వానంద్‌ కోసం సూర్య.. అలరిస్తున్న ‘ఒకే ఒక జీవితం’ టీజర్‌

‘ఒకే ఒక జీవితం’ టీజర్‌ను విడుదల చేసిన సూర్య. శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రమిది..

Updated : 29 Dec 2021 17:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శర్వానంద్‌ కథానాయకుడిగా శ్రీ కార్తీక్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. రీతూ వర్మ కథానాయిక. అమల అక్కినేని, వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను కోలీవుడ్‌ ప్రముఖ నటుడు సూర్య బుధవారం విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. టైమ్‌ మెషీన్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతున్నట్టు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. స్నేహితులైన శర్వానంద్‌, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌ భవిష్యత్తు నుంచి వర్తమానంలోకి రావటం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తల్లీకొడుకుల అనుబంధం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఉంది. శర్వానంద్‌ కూల్‌ లుక్స్‌ ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రాన్ని ఎస్‌. ఆర్‌. ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదలకానుంది. ఈ సినిమాకి జేక్స్‌ బిజోయ్‌ స్వరాలందిస్తున్నారు. సుజిత్‌ సారంగ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు