SIIMA 2020: ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ పరిచయదర్శకుడు.. విజేత ఎవరో?

సైమా 2020 అవార్డ్స్‌ నామినేషన్లు. ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ పరిచయదర్శకుడు వివరాలు..

Updated : 03 Aug 2022 16:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్ అవార్డ్స్‌ (సైమా) అందుకునేది ఎవరా అనే ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ఆ ఉత్కంఠకి తెరదించుతూ సెప్టెంబరు 18, 19 తేదీల్లో ఈ అవార్డుల వేడుక అట్టహాసంగా జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే పలు విభాగాలకి సంబంధించిన నామినేషన్లని ప్రకటించిన సైమా తాజాగా  2020 సంవత్సరానికిగానూ ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ పరిచయదర్శకుడు, ఉత్తమ పరిచయనిర్మాత అవార్డుకి పోటీ పడుతున్న వారి జాబితాని విడుదల చేసింది. ఆ వివరాలివీ..

ఉత్తమ హాస్యనటుడు: వెన్నెల కిశోర్‌ (భీష్మ), హర్ష (కలర్‌ ఫొటో), సత్య (సోలో బ్రతుకే సో బెటర్‌), సునీల్‌ (అల వైకుంఠపురములో), సప్తగిరి (ఒరేయ్‌ బుజ్జిగా). ఉత్తమ పరిచయదర్శకుడు: సుబ్బు (సోలో బ్రతుకే సో బెటర్‌), సందీప్‌ రాజ్‌ (కలర్‌ ఫొటో), కరుణ కుమార్‌ (పలాస 1978), శైలేష్‌ కొలను (హిట్‌), రమణ తేజ (అశ్వథ్థామ). ఉత్తమ పరిచయనిర్మాత/ నిర్మాణ సంస్థ: అమృత ప్రొడక్షన్స్‌, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (కలర్‌ ఫొటో), సుధాస్‌ మీడియా (పలాస 1978), శ్రీ శక్తి స్వరూప్‌ మూవీ క్రియేషన్స్‌ (రాహు), కారంపూరి క్రియేషన్స్‌ (ప్రెషర్‌ కుక్కర్‌), థర్డ్‌ ఐ ప్రొడక్షన్స్‌ (మధ).

విజేతలను ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ద్వారా నిర్ణయించునున్నారు. www.siima.in వెబ్‌సైట్‌తో పాటు SIIMA ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా ప్రేక్షకులు తాము అభిమానించే వారికి ఓట్లు వేసి గెలిపించవచ్చు. మరి ఎవరు ఈ అవార్డుని అందుకుంటారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ అవార్డుల కార్యక్రమానికి హైదరాబాద్‌ వేదిక కానుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని