Thalapathy 66: బాస్‌ విచ్చేశాడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘దళపతి 66’ టైటిల్‌

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విజయ్‌- దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. #Thalapathy66 అనే వర్కింగ్‌ టైటిల్‌తో భారీ అంచనాల నడుమ ప్రారంభమైందీ చిత్రం.

Updated : 21 Jun 2022 20:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విజయ్‌ (Vijay)- టాలీవుడ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. #Thalapathy66 అనే వర్కింగ్‌ టైటిల్‌తో భారీ అంచనాల నడుమ ప్రారంభమైందీ చిత్రం. అప్పటి నుంచీ ఈ సినిమా టైటిల్‌ ఏంటి? ఇందులో విజయ్‌ ఎలా కనిపిస్తాడు? అంటూ అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. జూన్‌ 22న విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం తాజాగా ఆ రెండు కానుకలు అందించింది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరిష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘వారిసు’ (తమిళ్‌), తెలుగులో ‘వారసుడు’ అనే పేరు ఖరారైంది. విజయ్‌.. సూటు, బూటు ధరించి బాస్‌ గెటప్పులో అందరినీ ఆకట్టుకునేలా ఉన్నారు. ఈ చిత్రంలో విజయ్‌ సరసన రష్మిక నటిస్తోంది. తమన్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం 2023 సంక్రాంతికి విడుదలకానుంది. విజయ్‌ నేరుగా తెలుగులో నటిస్తున్న చిత్రమిదే. ఆయన హీరోగా గతంలో తెరకెక్కిన ‘తుపాకి’, ‘సర్కారు’, ‘విజిల్‌’, ‘మాస్టర్‌’, ‘బీస్ట్‌’ తదితర చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని