అతనిచ్చిన రూ.300 ఇప్పటికీ నా పర్సులోనే!

వన్‌ టూ త్రీ ఫోర్‌.. గెట్‌ ఆన్‌ ది డ్యాన్స్‌ ఫ్లోర్‌.. ఈ ఐటమ్‌ సాంగ్‌ గుర్తుండే ఉంటుంది. 2013లో విడుదలైన ‘చెన్నైఎక్స్‌ప్రెస్‌’లో దక్షిణ తార ప్రియమణి, బాలీవుడ్ నటుడు షారుఖ్‌ ఖాన్‌తో కలిసి ఆడిపాడిన ఐటమ్‌సాంగ్‌ అది.

Updated : 18 Jun 2021 20:30 IST

షారుఖ్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ప్రియమణి

వన్‌ టూ త్రీ ఫోర్‌.. గెట్‌ ఆన్‌ ది డ్యాన్స్‌ ఫ్లోర్‌.. ఈ ఐటమ్‌ సాంగ్‌ గుర్తుండే ఉంటుంది. 2013లో విడుదలైన ‘చెన్నైఎక్స్‌ప్రెస్‌’లో దక్షిణ తార ప్రియమణి, బాలీవుడ్ నటుడు షారుఖ్‌ ఖాన్‌తో కలిసి ఆడిపాడిన ఐటమ్‌సాంగ్‌ అది. ఇటీవలే విడుదలైన ఫ్యామిలీ మ్యాన్‌-2తో ఆకట్టుకున్న నటి ప్రియమణి ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్య్వూలో ‘చెన్నైఎక్స్‌ప్రెస్‌’లోని ‘వన్‌ టూ త్రీ ఫోర్‌ సాంగ్‌’ షూటింగ్‌ కబుర్లను ఇలా గుర్తుచేసుకుంది. ‘‘మహారాష్ర్టలోని వాయి అనే నగరంలో ఈ పాటను ఐదురోజుల పాటు చిత్రీకరించారు. అది మరచిపోలేని అనుభవం. షూటింగ్‌ సమయంలో షారుఖ్‌ ఐప్యాడ్‌లో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ ఆడుతుంటే రూ.300 ఇచ్చారు. అవి ఇప్పటికీ నా పర్సులో భద్రంగా దాచుకున్నా. షారుఖ్‌ని బాలీవుడ్‌ బాద్‌షా అని అనడానికి ప్రత్యేకించి ఒక్క కారణమంటూ లేదు. మనదేశంలో ఉన్న గొప్పనటుల్లో ఆయన ఒకరు. సక్సెస్‌ని ఎప్పుడూ తలకెక్కించుకోరు. షూటింగ్‌లోనూ అంతే స్వీట్‌ అండ్ సింపుల్‌గా ఉంటారు. చుట్టూ ఉండేవాళ్లని కంఫర్ట్‌ జోన్‌లో ఉంచుతారు. అతడి వ్యక్తిత్వమే తనని మరింత ప్రేమించేలా చేస్తుంది. తన చుట్టూ ఉండేవాళ్లు కంఫర్ట్‌గా ఉండేలా చూడటమే షారుఖ్‌ గొప్పదనం. అలాగే రేపటిరోజు ఏ డ్యాన్స్‌ స్టెప్‌ వేయాలో.. అది ముందురోజు నుంచే అభ్యాసం చేసేవారు. అరగంట పాటు అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్స్‌ని అడిగి తెలుసుకునేవారు. మరుసటి రోజు సమయం వృథా కాకుండా జాగ్రత్త పడేవారు. అలా షూటింగ్‌ సమయాన్ని చక్కగా ప్లాన్‌ చేసుకునే వారు’’ అంటూ షారుఖ్‌తో తన అనుబంధాన్ని చెప్పుకొచ్చింది ప్రియమణి

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని