Updated : 01 Jul 2022 20:04 IST

The Warriorr: పాన్‌ ఇండియా పోలీస్‌.. ‘ది వారియర్‌’ ట్రైలర్‌ వచ్చేసింది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఒక  చెట్టుపై 40 పావురాలు ఉన్నాయి. దాంట్లో ఒక్క పావురాన్ని కాలిస్తే, ఇంకా ఎన్ని ఉంటాయి. అన్నీ ఎగిరిపోతాయి’ అంటున్నారు రామ్‌. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది వారియర్‌’ (The Warriorr). కృతిశెట్టి కథానాయిక. శుక్రవారం ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తెలుగు ట్రైలర్‌, నటుడు శివ కార్తికేయన్‌ తమిళ్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. ఆద్యంతం మాస్‌ ప్రేక్షకులను అలరించేలా సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ప్రతినాయకుడి పాత్రలో ఆది పినిశెట్టి చెప్పిన డిఫరెంట్‌ డిక్షన్‌ భలేగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకురానుంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని