Telugu movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

telugu movies: ఈ వారం థియేటర్‌లో సందడి చేయబోయే చిన్న సినిమాలివే!

Updated : 02 May 2022 13:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వరుసగా భారీ సినిమాలు విడుదలవుతుండటంతో చిన్న సినిమాలన్నీ తమ విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి. ఎట్టకేలకు మే మొదటివారంలో ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయడానికి వస్తున్నాయి.

మరోసారి వైవిధ్యమైన కథతో శ్రీవిష్ణు

శ్రీవిష్ణు(sri vishnu) కథానాయకుడిగా వారాహి చలన చిత్రం పతాకంపై తెరకెక్కిన సినిమా‘భళా తందనాన’(Bhala thandanana). కేథరిన్‌(Catherine)కథానాయిక. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. రజనీ కొర్రపాటి నిర్మాత. సాయి కొర్రపాటి సమర్పకులు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. వాణిజ్యాంశాలతో అందరికీ వినోదాన్ని పంచుతుంది’ అని సినీ వర్గాలు తెలిపాయి. రామచంద్రరాజు, శ్రీనివాస్‌రెడ్డి, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.


జయమ్మ పంచాయతీ ఏంటి?

తన యాంకరింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు నటి సుమ(Suma). అప్పుడప్పుడు వెండితెరపై తళుక్కున మెరిసినా, పూర్తిస్థాయి పాత్రను ఇప్పటివరకూ పోషించలేదనే చెప్పాలి. ఈ క్రమంలో ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘జయమ్మ పంచాయతీ’(Jayamma panchayathi). విజయ్‌ కుమార్‌ కలివరపు దర్శకుడు. మే 6న ఈ సినిమా విడుదల కానుంది.  పల్లెటూరి డ్రామాగా రూపొందిన చిత్రమిది. ఎవరికీ.. దేనికీ లొంగని నిస్వార్థపూరితమైన పల్లెటూరి మహిళ పాత్రలో సుమ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించటం విశేషం. దినేష్‌, షాలిని జంటగా నటించిన ఈ చిత్రాన్ని బలగ ప్రకాశ్‌ నిర్మిస్తున్నారు.


అర్జున్‌ పెళ్లి అయిందా?

విశ్వక్‌సేన్‌(vishwak sen), రుక్సార్‌ థిల్లాన్‌(Rukshar Dhillon) జంటగా విద్యాసాగర్‌ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’(Ashoka Vanamlo Arjuna Kalyanam). ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా మే 6వ తేదీనే ఈ చిత్రాన్ని కూడా విడుదల చేయనున్నారు. పెళ్లి చూపులకని గోదావరి జిల్లాలోని ఓ ఊరికి వెళ్లి 33ఏళ్ల అర్జున్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఆడ పెళ్లి వాళ్ల నుంచి ఎలాంటి మర్యాదలు అందాయి? అనుకోని పరిస్థితుల్లో పెళ్లి ఎందుకు క్యాన్సిల్‌ చేసుకోవాల్సి వచ్చింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


ఓటీటీలో విడుదల కానున్న చిత్రాలు

వైలెంట్‌ పాత్రలో కీర్తి సురేశ్‌!

కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోన్న కీర్తి సురేశ్‌(Keerthy suresh) ఇప్పుడు ఓ విభిన్న పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యారు. సెల్వరాఘవన్‌తో కలిసి ఆమె నటించిన తాజా చిత్రం ‘చిన్ని’(Chinni). అరుణ్‌ మథేశ్వరం దర్శకుడు.  పోలీస్‌ కానిస్టేబుల్‌గా పనిచేసిన చిన్ని అనే యువతి రంగయ్యతో కలిసి 24 హత్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఇంతకీ రంగయ్యకు, చిన్నికీ ఉన్న సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మే 6న ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ప్రైమ్‌ వీడియో వేదికగా ‘చిన్ని’ స్ట్రీమింగ్‌ కానుంది.


అమెజాన్‌ ప్రైమ్‌

* ద వైల్డ్స్‌(వెబ్‌ సిరీస్‌2) మే 6

* మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌(కన్నడ) మే5

నెట్‌ఫ్లిక్స్‌

* రాధేశ్యామ్‌(హిందీ) మే 4

* 40 ఇయర్స్‌ యంగ్‌ (హాలీవుడ్‌) మే4

* థార్‌(హిందీ) మే 6

* ఎలోన్‌ ఫర్‌ ది రైడ్‌

* ది సౌండ్‌ ఆఫ్ మ్యూజిక్‌(వెబ్‌ సిరీస్‌)మే6

జీ5

* ఝుండ్‌ (హిందీ)మే6

డిస్నీ + హాట్‌స్టార్‌

* హోమ్‌ శాంతి(హిందీ సిరీస్‌) మే6

* స్టోరీస్‌ ఆన్‌ది నెక్ట్స్‌ పేజ్‌(హిందీ సిరీస్‌) మే6

సోనీ లివ్‌

* పెట్‌ పురాణ్‌(తెలుగు) మే6

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని